Mumbai Indians : ముంబయి ఇండియన్స్ ప్లే ఆప్స్ కు వెళ్లడం కష్టమేనా?
Mumbai Indians : ముంబయి ఇండియన్స్ కోల్ కతా తో మ్యాచ్ లో ఓడిపోవడంతో ఈ సీజన్ లో ప్లే ఆప్ రేసు నుంచి
దాదాపు నిష్క్రమించినట్లే కనిపిస్తోంది. మొదటి అయిదు మ్యాచులకు దూరమైన సూర్య కుమార్ యాదవ్ టీంలోకి వచ్చినా పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాడు. ఈ సమయంలో 11 మ్యాచులు ఆడిన ముంబయి ఇండియన్స్ కేవలం 3 మ్యాచులు మాత్రమే గెలిచింది.
ఈ సీజన్ లో మొదటి మూడు మ్యాచులు ఓడిపోయిన ముంబయి ఇండియన్స్ ఆ తర్వాత మూడు మ్యాచులు నెగ్గి పామ్ లోకి వచ్చినట్లే కనిపించినా తిరిగి వరుసగా అయిదు మ్యాచులు ఓడిపోవడంతో ప్లే ఆప్ రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ 8 మ్యాచులు గెలిచి 16 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా.. ఇంకా ఆ జట్టుకు నాలుగు మ్యాచులు ఆడే చాన్స్ ఉంది. దీంతో ఆ జట్టు బెర్త్ దాదాపు కన్ఫం అయిపోయింది.
ఇంకా మూడు మిగిలిన బెర్త్ ల కోసం కోల్ కతా, చెన్నై, సన్ రైజర్స్, లక్నో తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఢిల్లీ కూడా 11 మ్యాచుల్లో 5 గెలిచింది. మిగిలిన మూడు మ్యాచులు కూడా గెలిస్తే నెట్ రన్ దృష్ట్యా ప్లే ఆప్స్ కు వెళ్లే అవకాశముంది. కానీ ఆర్సీబీ, ముంబయి ఇండియన్స్ కు ఏదైనా అనుకోని మిరాకిల్ జరిగితే తప్ప ప్లే ఆప్ అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి.
అన్ని టీంలు 10 మ్యాచులు ఆడగా ఢిల్లీ, ముంబయి మాత్రమే పదకొండు మ్యాచులు ఆడాయి. పంజాబ్ 10 మ్యాచులకు 4 గెలిచింది. ఇంకా నాలుగు ఆడాల్సి ఉంది. ఇది కూడా నాలుగు మ్యాచులు వరుసగా గెలిచి నెట్ రన్ రేట్ బాగా ఉంటే ప్లే ఆప్ వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ముంబయి ఇండియన్స్, ఆర్సీబీ మినహా అన్ని టీంలకు ఇంకా చాన్స్ ఉన్నట్లే తెలుస్తోంది. ఒక వేళ ముంబయి ఇండియన్స్ ప్లే ఆప్స్ కు వెళ్లాంటే మిగతా మూడు మ్యాచులు భారీ రన్ రేట్ తో గెలిచి మిగతా జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది.