Danger If KCR Does Not Win : కేసీఆర్ గెలవకపోతే ప్రమాదమా?.. బీఆర్ఎస్ కు ఇక్కట్లేనా..?

Danger If KCR Does Not Win

Danger If KCR Does Not Win

Danger If KCR Does Not Win : తెలంగాణలో ఎన్నికల తేదీ దూసుకొస్తున్నది. మరో తొమ్మిది రోజుల్లో ఎన్నికలు పూర్తి కానున్నాయి. 12 రోజుల్లో అధికారంలోకి వచ్చేది ఎవరనేది తేలిపోనుంది. ఈ సమయంలో కొత్త చర్చ మొదలైంది. తెలంగాణలో గెలవాల్సిన పరిస్థితిని అధికార పార్టీ బీఆర్ఎస్ తెచ్చుకుంది. ఎందుకంటే ఒక్కసారి జాతీయ పార్టీలు అధికారంలో కి వస్తే ఏం జరుగుతుందో కేసీఆర్ కు బాగా  తెలుసు. ఈ క్రమంలో గెలవడానికి ఉన్న అన్ని దారులను ఆయన ఉపయోగించుకుంటున్నారు.

అయితే గతంలో కర్ణాటక, బిహార్, మహారాష్ర్ట లో ప్రాంతీయ పార్టీల పరిస్థితే ఒక వేళ ఓడిపోతే బీఆర్ఎస్ కు ఎదురవుతుందనే అభిప్రాయం ఏర్పడుతుంది. కర్ణాటకలో జేడీయూ, బిహార్ లో ఆర్జేడీ, మహారాష్ర్టంలో ఎన్సీపీ, శివసేన లాంటి పార్టీ ల పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. ఒక్క సారి ఓడిపోతే అయితే కాంగ్రెస్. లేదంటే బీజేపీ వంచన చేరాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. లేకుంటే రాష్ర్టంలో పోరు మొత్తం కాంగ్రెస్ ,బీజేపీ మధ్యనే సాగి ప్రాంతీయ పార్టీ అయినా  బీఆర్ఎస్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఇక తెలంగాణలో ప్రాంతీయ పార్టీ ఏదైనా జాతీయ పార్టీతో కలిసి పోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇది కేసీఆర్ కు, ఆయన వారసుడిగా కేటీఆర్ కు చాలా ఇబ్బందులను తెస్తుంది. అందుకే ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని ఆయన పక్కా ప్లాన్ తోనే ముందుకెళ్తున్నట్లు కనిపిస్తున్నది.

దీంతో పాటు ఒక్కసారి ఓడిపోతే శ్రేణులు కూడా పక్క పార్టీ  ల వైపు చూడడం ఖాయం. నాయకగణం కూడా కాంగ్రెస్ లోనో, బీజేపీలోనో చేరాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో చావో రేవో లాంటి ఈ ఎన్నికలను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలో తనలోని అహంకారపూరిత ధోరణికి భిన్నంగా వెళ్తున్నారు. సీఎం హోదాలో ఆయన చూపించే అహంకారం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు అందుకు భిన్నంగా సభల్లో ప్రసంగిస్తున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఎదురవుతున్నది. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పై తనదైన శైలిలో నోరుపారేసుకోవడం లేదు. కేవలం కరెంట్, ధరణి అనే రెండు సబ్జెక్టులను పట్టుకొని మాత్రమే ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్ వస్తే ఈ రెండు బంగాళఖాతంలో కలుస్తాయని మెల్లగా ప్రజల మెదల్లోకి ఎక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో ఆయన కొంత సక్సెస్ అయ్యారు. అయితే ఎన్నికల ముందు నాటికి ఇప్పటికి  పరిస్థితుల్లో మార్పువచ్చినట్లు కనిపిస్తున్నది. కొంత బీఆర్ఎస్ వైపు టాపిక్ తిప్పుకునేలా చేసుకోవడం లో సీఎం కేసీఆర్ సక్సెస్ అయినట్లు కనిపిస్తున్నది. మరో 9 రోజులను ఆయన కచ్చితంగా సద్వినయోగం చేసుకొని, తెలంగాణ ప్రజలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఏదేమైనా తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోరు అనేది మాత్రం ఇప్పటికే తేలిపోయింది. ఇక ప్రజా తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాలి.

TAGS