JAISW News Telugu

 Raja Saab : ప్రభాస్ ‘రాజా సాబ్’ చిత్రాన్ని మిస్ చేసుకున్న అన్ లక్కీ హీరో అతనేనా!

unlucky hero who missed Raja Saab movie

that unlucky hero who missed Raja Saab movie

Raja Saab : బాహుబలి సిరీస్ తర్వాత కేవలం పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ లోకల్ మాస్ కమర్షియల్ సినిమాలకు ప్రభాస్ దూరం అయిపోతున్నాడు అంటూ అభిమానులు చాలా కాలం నుండి ఫీల్ అవుతూ వస్తున్నారు. అలాంటి అభిమానుల కోసమే ఆయన ‘రాజా సాబ్’ సినిమాని ఫిక్స్ చేసాడు. ‘రాధే శ్యామ్’ సినిమా ముగింపు దశలో ఉన్నప్పుడు ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా చాలా సైలెంట్ గా ఈ చిత్రం మొదలైంది.

ఎక్కడా కూడా ఈ సినిమా చేస్తున్నామని ప్రభాస్ అధికారిక ప్రకటన చెయ్యలేదు. ఆ చిత్ర దర్శకుడు  మారుతి కూడా ఈ సినిమాకి సంబంధించిన వివరాలను బయటపడకుండా చాలా జాగ్రత్త పడ్డారు. కానీ సోషల్ మీడియా యుగం లో ఒక విషయం ని దాచడం అంత సులువు కాదు. ఈ సినిమాకి సంబంధించిన మేకింగ్ స్టిల్స్ కొన్ని లీక్ అయ్యాయి. అప్పుడు ఫ్యాన్స్ కి అర్థం అయ్యింది. నిజంగానే వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతుంది అని.

ఆ తర్వాత ఈ చిత్రం గురించి మరికొన్ని వివరాలు తెలిసాయి. ఈ సినిమాలో హీరోయిన్స్ గా మాళవిక మోహన్ , నిధి అగర్వాల్ నటిస్తున్నారని, సినిమా పేరు ‘రాజా డీలక్స్’ అని, ఇది ఒక హారర్ కామెడీ చిత్రం అని, ఇలా పలు రకాల వార్తలు లీక్ అయ్యాయి. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ‘రాజా డీలక్స్’ టైటిల్ కాస్త ‘రాజా సాబ్’ అయ్యింది. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చెయ్యగా, దానికి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ ని ఈ యాంగిల్ లో చూసి చాలా కాలం అయ్యింది. మళ్ళీ మా హీరోలో మాస్ యాంగిల్ ని బయటకి తీసినందుకు కృతఙ్ఞతలు అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డైరెక్టర్ మారుతీ ని ట్యాగ్ చేసి చెప్పుకొచ్చారు.

ఇకపోతే ఈ సినిమాని మొదట మారుతి న్యాచురల్ స్టార్ నాని కోసం రాసుకున్నాడట. నాని కూడా కథ ఎంతగానో నచ్చి, సిద్ధం గా ఉంచు, కమిట్మెంట్స్ పూర్తి అయ్యాక చేద్దాం అని మారుతీ తో అన్నాడట. కానీ కొన్నాళ్ళకు ప్రభాస్ మారుతీ కి ఫోన్ చేసి ఒక మంచి కమర్షియల్ చిత్రం ఉంటే చూడు, చేద్దాం అని అన్నాడట. అప్పుడు ఆయన దగ్గర ఉన్న ఈ ‘రాజా సాబ్’ స్టోరీ ని ప్రభాస్ కి వినిపించాడట. సింగల్ సిట్టింగ్ లోనే కథ ని ఓకే చేసాడు ప్రభాస్. అయితే ఇదే విషయాన్నీ నాని కి చెప్పగా, ఆయన ఏమి పర్వాలేదు, మనం వేరే స్క్రిప్ట్ తో చేద్దాం అని పాజిటివ్ గా రెస్పాన్స్ ఇచ్చాడట.

Exit mobile version