సినీ పరిశ్రమకు సంబంధించి వ్యవహారాలను పూర్తి స్వయంప్రతిపత్తితో నిర్వహించేందుకు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పూర్తి అధికారాన్ని ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారాలను తన తరుఫున చూసుకునే బాధ్యతను త్రివిక్రమ్ కు అప్పగించారు.
అధికారిక డాక్యుమెంటేషన్ లేనప్పటికీ.. ఈ ఏర్పాటు పరస్పర విశ్వాసం పై కొనసాగుతుంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన అశ్వనీదత్ కూడా కల్కి సినిమా టికెట్ ధరల పెంపుపై సంప్రదింపులు జరిపేందుకు పవన్ కళ్యాణ్ ద్వారా త్రివిక్రమ్ ను సంప్రదించాల్సి వచ్చిందని అంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ను నేరుగా కలవడానికి త్రివిక్రమ్ ను ఎవరూ దాటలేరు. పవన్ ను ఎవరైనా సంప్రదిస్తే సింపుల్ గా త్రివిక్రమ్ వైపు మళ్లిస్తారు. ఇందుకు ఉదాహరణే.. త్రివిక్రమ్ తో సత్సంబంధాలు లేని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పుష్ప 2: ది రూల్ సినిమా.
పుష్పఫ 2 టికెట్ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉన్నా వారి ఏకైక మార్గం త్రివిక్రమ్ ద్వారానే. అల్లు అర్జున్ నెక్ట్స్ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ తోనే అయినా పవన్ కళ్యాణ్ తో అల్లు అర్జున్ రిలేషన్ తెగిపోయింది. ఈ పరిస్థితి త్రివిక్రమ్ కు సవాలును మారుతుంది. మరి త్రివిక్రమ్ ఈ డైనమిక్స్ ను ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.
‘పుష్ప 2’ విడుదలకు ముందే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య సయోధ్య కుదిర్చడంలో త్రివిక్రమ్ కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు.