Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అభిమానులు ఈ సినిమా కోసం ఎన్నో రోజుల నుండి ఎంతో ఆశతో ఎదురు చూసారు. ‘అలా వైకుంఠపురంలో’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బ్లాక్ బస్టర్ తీసిన తర్వాత త్రివిక్రమ్ చేసిన సినిమా కావడం తో తమ హీరోకి కూడా అలాంటి ఎంటర్టైనర్ తీస్తాడని ఫ్యాన్స్ అనుకున్నారు, కానీ పదేళ్ల క్రితం తియ్యాల్సిన రొటీన్ కమర్షియల్ సినిమాని ఇప్పుడు తీసి అభిమానులకు, ఆడియన్స్ కి కోలుకోలేని షాక్ ఇచ్చాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.
మొదటి రోజు కాంబినేషన్ క్రేజ్ వల్ల మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ, రెండవ రోజు మాత్రం దారుణంగా వసూళ్లు పడిపోయాయి. ‘బ్రహ్మోత్సవం’ , ‘స్పై డర్’ వంటి డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత మహేష్ చేసిన ప్రతీ చిత్రం కమర్షియల్ గా మంచి విజయాలుగా నిలిచాయి. ‘స్పై డర్’ తర్వాత మహేష్ కి ఆ రేంజ్ ఫ్లాప్ అంటే ‘గుంటూరు కారం’ అనే చెప్పాలి.
అయితే ఈ స్క్రిప్ట్ ముందుగా మహేష్ బాబు తో చెయ్యాలని అనుకోలేదట. త్రివిక్రమ్ ఈ కథ ని అల్లు అర్జున్ కోసం పక్కన పెట్టాడట. మహేష్ కోసం ఆయన ఒక్క యాక్షన్ మూవీ ని ముందుగా ప్లాన్ చేసుకున్నాడు. కానీ మహేష్ కి ఆ కథ నచ్చక, ఇలాంటి రిస్క్ ఇప్పుడు వద్దు, మా ఫ్యాన్స్ నా నుండి కమర్షియల్ సినిమాని చాలా కాలం నుండి కోరుకుంటున్నారు. ఈమధ్య నేను అలాంటి కమర్షియల్ సినిమాలకు దూరం అయ్యాను. వాళ్ళ కోసం మంచి కమర్షియల్ సబ్జెక్టు ఉంటే తీసుకొనిరా, తొందరగా షూటింగ్ ని పూర్తి చేసి సంక్రాంతికి దింపేద్దాం అని అన్నాడట. అప్పటికప్పుడు కమర్షియల్ సబ్జెక్టు రాయాలంటే మరింత సమయం పట్టుది, అల్లు అర్జున్ కోసం రాసుకున్న కథని వినిపిద్దాం అని ఆ కథని మహేష్ కి వినిపించాడట.
అది ఆయనకీ తెగ నచ్చేసింది. వెంటనే ఒప్పుకోని షూటింగ్ పూర్తి చేసి నిన్న విడుదల చేసారు. ఫలితం మన అందరికీ తెలిసిందే. ఈ కథ అల్లు అర్జున్ వరకు వెళ్లకుండా మంచి జరిగింది అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. త్రివిక్రమ్ ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ మధ్యలోకి వస్తే చితకబాదేసేటట్టు ఉన్నారు. అంత కోపంగా ఉన్నారన్నమాట. కమర్షియల్ గా ఈ సినిమా కనీసం 50 నష్టం తెచ్చే అవకాశాలు ఉన్నాయని బయ్యర్స్ చెప్తున్నారు. కానీ సంక్రాంతి సెలవలు ఎంత రికవరీ చేస్తుందో చూడాలి.