Harthik Pandya : ఐపీఎల్ సంరంభం కోసం ఫ్రాంచైజీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. డిసెంబర్ 19న ఆటగాళ్ల వేలం ప్రక్రియ పూర్తి చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు ఆటగాళ్లు తమ ఫ్రాంచైజీలను ఎంచుకుంటున్నారు. కొన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్లను దూరం చేసుకుంటున్నాయి. తమకు నచ్చిన వారిని తీసుకునేందుకు ఆలోచిస్తున్నాయి.
ఇన్నాళ్లు హార్థిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ కు ఆడాడు. ప్రస్తుతం ముంబయికి బదిలీ అయ్యాడు. హార్థిక్ పాండ్యా రాకతో ముంబయి మరింత బలోపేతమైనట్లు తెలుస్తోంది. ముంబయి ఏడాదికి రూ. 15 కోట్లు చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఎంత శాతం లాభాలు వచ్చినా అందులో నుంచి 50 శాతం హార్థిక్ కు దక్కుతుంది. ఇలా ముంబయితో చేసుకున్న ఒప్పందంతో హార్థిక్ వీరి సొంతమైనట్లు చెబుతున్నారు.
గత వేలంలో రూ. 17.5 కోట్లు చెల్లించి తీసుకున్న ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ ను బెంగుళూరుకు ముంబయి ఇచ్చింది. హార్థిక్, గ్రీన్ పరస్పరం జట్లు మారేందుకు అంగీకరించడంతో ఈ ప్రక్రియ సులభంగా మారింది. ముంబయి దగ్గర తగినంత డబ్బు లేకపోవడంతో గ్రీన్ ను బెంగుళూరుకు అమ్మేసి హార్థిక్ ను సొంతం చేసుకుంది.
ఐపీఎల్ మ్యాచ్ లు ఈ సారి పరుగుల పంట పండించాలని చూస్తున్నాయి. ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను మార్చుకుంటున్నాయి. దీంతో కప్ గెలిచేది ఏ జట్టో తెలియడం లేదు. పది జట్లు కూడా పట్టు కోసం ప్రయత్నించడం ఖాయం. అన్ని ఫ్రాంచైజీలు తమ ఉనికి కోసం ఆటగాళ్లను మారుస్తున్నాయి. పనికి రాని వారిని తీసేసి పనికొచ్చే వారిని తీసుకోవడానికి ముందుకు వస్తున్నాయి.