Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’ ఎన్నో భారీ అంచనాల నడుమ నేడు విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ ని తెచ్చుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా అంటే కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ ని ఈ సినిమా రీచ్ కాకపోగా , మహేష్ బాబు తో చాలా చీప్ సన్నివేశాలను చిత్రీకరించారు అంటూ మహేష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
మహేష్ బాబు తాను ఈ సినిమా కోసం ఎంత న్యాయం చెయ్యాలో, అంతకు మించే న్యాయం చేసాడు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ బలహీనమైన స్క్రీన్ ప్లే, నాశిరకం టేకింగ్ కారణంగా ఈ చిత్రం జనాలకు నచ్చలేదంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈ సినిమా ఔట్పుట్ ఇలా రావడానికి కారణం మహేష్ బాబే అని ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తున్న మాట.
ఎందుకంటే ముందుగా త్రివిక్రమ్ అనుకున్న కథ ఇది కాదు. మహేష్ బాబు తో ఆయన ఈసారి ఒక భారీ యాక్షన్ మూవీ చేద్దాం అని వచ్చాడు. ఆ కథతోనే సినిమాని ప్రారంభించి ఒక షెడ్యూల్ ని చేసారు. కానీ ఆ షెడ్యూల్ కి సంబంధించిన ఔట్పుట్ మహేష్ బాబు కి అసలు నచ్చలేదు. వెంటనే స్క్రిప్ట్ ని మార్చమని చెప్పి, అసలు యాక్షన్ జానర్ ని కాకుండా మామూలు కమర్షియల్ కథని సిద్ధం చెయ్యమని త్రివిక్రమ్ కి చెప్పాడు. త్రివిక్రమ్ అయిష్టంగానే ఓకే చెప్పి ‘గుంటూరు కారం’ స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడు. ఈ స్క్రిప్ట్ కూడా మహేష్ కి నచ్చలేదు. ఎక్కడో ఎదో మిస్ అవుతుందని, నా దగ్గర ఒక టీం ఉందని,ఆ టీం సహాయం తో స్క్రిప్ట్ రెడీ చెయ్యమని త్రివిక్రమ్ కి చెప్పాడు. ఆయన చెప్పినట్టుగానే టీం ఇచ్చిన సలహాలతో తయారు చేసిన కథ ‘గుంటూరు కారం’.
ఈరోజు మనమంతా చూసింది ఇలా ఇన్ని మార్పులు చేర్పులు చేసిన కథనే. మహేష్ చేసిన ఈ పొరపాటు కారణంగానే సినిమా ఔట్పుట్ అలా వచ్చిందని, ముందుగా అనుకున్న స్టోరీ తో చేసి ఉంటే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేదని అంటున్నారు. తప్పు ఎవరిదైనా ముందుగా అభిమానులు తిట్టేది డైరెక్టర్ నే. అందుకే డైరెక్టర్లు హీరోలకు లొంగిపోకుండా తమ మనసుకి నచ్చిన స్క్రిప్ట్ నే చెయ్యాలి అని అంటున్నారు నెటిజెన్స్.