Dinesh Karthik : దినేశ్ కార్తీక్ మళ్లీ పెళ్లిచేసుకోబోతున్నాడా?

Dinesh Karthik getting married again
Dinesh Karthik : భారత క్రికెట్ ఆటగాడు దినేశ్ కార్తీక్ ఆటకు విరామం ఇవ్వకుండానే కామెంటర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల భారత్ – ఇంగ్లాండ్ తొలి టెస్ట్ లో భారత ప్రదర్శనపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టీమిండియా పూర్తి రక్షణాత్మక ధోరణిలో ఆడారని, చెత్త ఫీల్డింగ్ సెటప్ చేశారని, రోహిత్ శర్మ చెత్త కెప్టెన్సీనే కారణమని మండిపడి వార్తల్లో నిలిచాడు. ఇదిలా ఉండగా ఇటీవల కొత్తింట్లోకి అడుగుపెట్టాడు దినేశ్ కార్తీక్, తన భార్య దీపికా పల్లికల్ తో కలిసి ప్రత్యేక పూజలు చేశాడు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి.
దినేశ్ కార్తీక్ టీమిండియాలో బెస్ట్ ఫినిషర్ గా పేరు తెచ్చుకున్నాడు. కానీ అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. ధోనితా పాటుగా జట్టులో ఉండడం, డీకే స్వతహాగా వికెట్ కీపర్ కావడంతో..టీమ్ లో ప్లేస్ లేదు. అయితే ఐపీఎల్, దేశవాళీ ట్రోఫీల్లో మాత్రం దుమ్మురేపేవాడు. ఇటీవల జరిగిన దేశవాళీ ట్రోఫీలో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్న ఇంగ్లాండ్ లయన్స్ జట్టుకు సలహాదారుడిగా వ్యవహరిస్తున్నాడు.
ఇదిలా ఉండగా డీకే ఇటీవల కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేశాడు. దీపికతో కలిసి ప్రత్యేక పూజలు చేస్తున్నా, పాలు పొంగించే పిక్స్ ను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ ఇంటి కోసం దాదాపుగా రూ.6 కోట్ల వరకూ ఖర్చు పెట్టాడు. తనకు ఇష్టమైన రీతిలో ఇంటిని డిజైన్ చేసుకున్నాడు. అయితే డీకే షేర్ చేసిన ఈ ఫొటోల్లో దీపిక పల్లికల్ గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. సడెన్ గా చూస్తే దీపిక ఏంటి ఇలా మారిపోయింది అనుకోవడం ఖాయం. ఆమెను పలువురు నెటిజన్లు దినేశ్ కార్తీక్ మళ్లీ పెళ్లిచేసుకున్నాడా? అంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.
View this post on Instagram