Huge Money From Karnataka : ఎన్నికల వేళ తెలంగాణకు విపరీతంగా డబ్బు అక్రమ రవాణా అవుతోంది. కర్ణాటక నుంచి భారీగా డబ్బులు వస్తున్నాయని పోలీసు నిఘాలో తెలుస్తోంది. ఈనేపథ్యంలో నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో డబ్బు ప్రవాహం కట్టలు తెంచుకుంటోంది. దీంతో ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గాలనే ఉద్దేశంతో డబ్బు విచ్చలవిడిగా పంచేందుకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. అందుకే ఇలా డబ్బును పంపిణీ చేసేందుకు అడ్డదారుల్లో వెళ్తున్నట్లు చెబుతున్నారు.
కర్ణాటక నుంచి రూ.44 లక్షలు కారులో తరలిస్తుండగా వనస్థలిపురం పోలీసులు పట్టుకున్నారు. డబ్బు సీజ్ చేశారు. ఎన్నికల నేపథ్యంలో డబ్బు విపరీతంగా తరలిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో అక్కడ నుంచి డబ్బు సంచులు తెలంగాణకు తరలిస్తున్నట్లు భావిస్తున్నారు. దీంతో హవాలా మార్గంలో డబ్బు అడ్డగోలుగా తరలిస్తున్నారనే వాదనలు కూడా వస్తున్నాయి.
పట్టుబడిన డబ్బు ఎవరిదనే విషయంలో విచారణ కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ భారీ మొత్తంలో నగదును రవాణా చేసేందుకు ప్లాన్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తరలిస్తున్న డబ్బుపై ఆధారాలు లభిస్తే చర్యలు తీసుకోవడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. దీంతో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.
తెలంగాణకు కోట్లాది రూపాయలు రవాణా అవుతున్నాయనే చెబుతున్నారు. కర్ణాటకలో పార్టీ అధికారంలో ఉండటంతో హవాలా మార్గంలో నిధులు అధికంగా కూడబెట్టినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ నుంచి డబ్బులు తరలించేందుకు పలు మార్గాలు అన్వేషిస్తోంది. ఇక్కడ దొరికిన డబ్బు ఎలా దొరికింది? ఎవరిదనే కోణంలో విచారణ సాగుతోంది.