JAISW News Telugu

Dubai Floods : దుబాయ్ వరదలకు కారణం క్లౌడ్ సీడింగేనా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు..

Dubai Floods

Dubai Floods

Dubai Floods : ప్రస్తుతం ఇంటర్నేషనల్ లెవల్ లో చర్చలో ఉన్న అంశం ‘దుబాయ్ వరదలు’. ఇంత పెద్ద వరదలు దాదాపు దుబాయ్ ఎప్పుడూ చూడలేదంటే అతిశయోక్తి. దుబాయ్ లో ఎండలు ఎక్కువ. ఎంతలా అంటే ఒక్కోసారి 50 డిగ్రీల సెల్సియస్ కు దాటుతుంటాయి. ఇంత ఎండలను భరిస్తూ దుబాయ్ ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు. కానీ, ఇటీవల ప్రకృతి వారిపై ఒక్కసారిగా విరుచుకుపడింది. వరదలతో ముంచెత్తింది. దీంతో దుబాయ్ లో తీవ్రంగా ఆస్తి నష్టం జరిగింది. దీనికి కారణం ‘క్లౌడ్ సీడింగ్’ అంటూ ప్రపంచ దేశాల్లో చర్చ మొదలైంది.

క్లౌడ్ సీడింగ్ అంటేంటి?

క్లౌడ్ సీడింగ్ అనేది ఉన్న మేఘాల నుంచి వర్షంను కురిపించే కృత్రిమ పద్ధతి. చిన్న కణాలు (సిల్వర్ అయోడైడ్ వంటివి) విమానం సాయంతో మేఘాల్లోకి వదిలితే  నీటి ఆవిరి సులభంగా ఘనీభవించి వర్షంగా మారుతుంది.

ఈ సాంకేతికత దశాబ్దాలుగా ఉంది. UAE ఇటీవలి సంవత్సరాల్లో నీటి కొరతను పరిష్కరించడంలో క్లౌడ్ సీడింగ్ బాగా సాయపడింది. వరదలు ముంచెత్తిన తర్వాత కొంత మంది సోషల్ మీడియాలో క్లౌడ్ సీడింగ్ ఎఫెక్ట్ గా ప్రచారం చేశారు.

దుబాయ్, వాస్తవానికి, భారీగా పట్టణీకరణ చేయబడింది. తేమను గ్రహించడానికి తక్కువ స్థలం ఉంది. డ్రైనేజీ సౌకర్యాలు అధిక వర్షపాతాన్ని తట్టుకోలేకపోయాయి. దీంతో వరదనీరంతా వెల్లువలా కలనీలు, వీధులను ముంచెత్తింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లింది.

శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే?

తుఫాను ప్రారంభంలో ఒమన్‌ను తాకింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ)ని తాకింది, ఇది విద్యుత్ అంతరాయానికి దారితీసింది, విమాన ప్రయాణానికి అంతరాయం కలిగించింది. భారీ వర్షాల కారణంగా ఒమన్‌లో 20 మంది ప్రాణాలు కోల్పోయారని నివేదికలు తెలిపాయి. UAEలో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూసివేశారు.

ఒమన్ సరిహద్దులో ఉన్న అల్ఐన్ నగరంలో రికార్డు స్థాయిలో 254 మిల్లీ మీటర్ల (10 అంగుళాలు) వర్షపాతం నమోదైంది. ఇది 24 గంటల వ్యవధిలో అత్యధిక వర్షపాతంగా మారింది. ఇది మొత్తం సంవత్సరంలో దేశం చూసిన సగటు వర్షపాతాన్ని మించిపోయింది.

Exit mobile version