YCP Vs Chandrababu : పూర్వం ఓ సామెత ఉంది బిడ్డ ప్రసవించకపోతే అల్లుడి మీద ఏడ్చిందట. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మీద వస్తున్న ఆరోపణలకు కారణం చంద్రబాబే అని నిందలు వేయడం జగన్ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ప్రతిపక్షాలు ఏ ఆరోపణ చేసినా బాబే సూత్రధారిగా చెబుతున్నారు. ఇన్ని రకాల కుట్రలకు బాబే కారణం అయితే జగన్ బట్టకట్టేవాడా? అధికారంలోకి వచ్చేవాడా?
ఇసుక మాఫియాలో చంద్రబాబు హస్తముందంటున్నారు. పనులు కాకపోవడానికి బాబు నిందితుడంటున్నారు. పనులు ముందుకు సాగకపోవడానికి ఆయనే ప్రధాన కారణమని నిందిస్తున్నారు. కోడి కత్తి కేసు, వివేకా హత్య కేసులో కూడా బాబే ప్రధాన పాత్రధారిగా చెబుతున్నారు. ఇలా ఒకటేమిటి రాష్ట్రంలో ఏం జరిగినా దానికి కారణం బాబే అని సెలవిస్తున్నారు.
ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సైతం జగన్ గెలవరని చెబుతుంటే అందులో కూడా బాబు హస్తం ఉందంటూ నిందలు వేస్తున్నారు. గత ఎన్నికల్లో జగన్ గెలుస్తాడని చెప్పిన పీకే ఇప్పుడు జగన్ గెలవరని అంచనా వేసి చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో తనకు ప్రతి విషయంలో బాబు ఎదురు వస్తున్నాడని చెబుతున్నారు. అందుకే తనకు అడ్డంకులు వస్తున్నాయని తెగ బాధపడుతున్నాడు.
ఇంత మందిని ప్రభావితం చేసే బాబు ఒక్క జగన్ ను అధికారంలోకి రానిస్తాడా? జగన్ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలు చూసే వారు జగన్ కు ఓటు వేయరాదని నిర్ణయించుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ఓటమి తథ్యం. టీడీపీ పాలన రావడం గ్యారంటీ అనే వాదనలు వస్తున్నాయి. మరో అవకాశం కోసం వేచి ఉన్న జగన్ ను ఇంటికే సాగనంపుతారని టాక్.
ఎక్కడ ఏం జరిగినా బాబే కారణమని దుమ్మెత్తిపోయడం వైసీపీకి అలవాటుగా మారింది. కానీ జనం ప్రతి విషయాన్ని పరిశీలిస్తున్నారు. జగన్ కుట్ర ఏంటి? బాబు సమర్థత ఏమిటనే దానిపై ఓ క్లారిటీకి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో బాబుకు బ్రహ్మరథం పడతారని సర్వేలు స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. దీంతో జగన్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.