BJP : దేశంలో బీజేపీ హవా కొనసాగుతోంది. మోదీ చరిష్మాలో ఇంకా వేడి తగ్గలేదు. ప్రపంచంలోనే దీటైన నేతగా నిలుస్తున్నారు. దీంతో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ ప్రభుత్వం వస్తుందని తెలుస్తోంది. ఈనేపథ్యంలో దేశంలో బీజేపీ బలం రెండింతలయింది. 2014లో 282 సీట్లు సాధించిన బీజేపీ 2019లో 303 స్థానాలు దక్కించుకుంది. దీంతో బీజేపీ శక్తి పతాక స్థాయికి చేరింది.
ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించింది. తెలంగాణలో మాత్రం సీన్ రివర్స్ అయింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్ రాష్ర్టాల్లో బీజేపీ సక్సెస్ అయింది. కాంగ్రెస్ ను వెనక్కి నెట్టింది. తెలంగాణలో కూడా బీజేపీకి మంచి ఆదరణ దక్కినా దాని స్థానాన్ని కాంగ్రెస్ ఎగరేసుకుపోయింది. నేతల్లో ఉన్న అనైక్యతను కాంగ్రెస్ క్యాష్ చేసుకుంది.
ఈ క్రమంలో దేశంలో నిర్వహిస్తున్న సర్వేలు బీజేపీకి 424 స్థానాలు వస్తాయని సూచిస్తున్నాయి. కాంగ్రెస్ కు 40-42, వైఎస్సార్ సీపీకి 15-18, త్రుణమూల్ కాంగ్రెస్ కు 28-35వరకు వస్తాయని తేల్చాయి. దీంతో బీజేపీ సత్తా ఇంకా పెరుగుతోంది. బీజేపీకి ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. కాంగ్రెస్ పుంజుకోవడం కష్టమే అంటున్నారు.
దీనికి తోడు బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటున్న ఇండియా టీంకు పలు పార్టీలు మద్దతు పలకడం లేదు. త్రుణమూల్ ఒంటరిగానే పోటీకి సిద్ధమంటోంది. దీంతో ఇండియా ఐక్య కూటమి ఆశలు గల్లంతే అని తెలుస్తోంది. బీజేపీకి ఎదురు లేదు. ఇప్పుడు దేశంలో బీజేపీ విక్టరీ సాధించడం ఖాయం. హ్యాట్రిక్ సాధించి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని యోచిస్తున్నారు.