BJP vs BRS : బీజేపీ అస్త్రం బీఆర్ఎస్ ను ఓడించబోతోందా?

BJP vs BRS

BJP vs BRS

BJP vs BRS : తెలంగాణలో ఎన్నికల ప్రచారం నేటితో పూర్తయింది. రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. అధికార పార్టీకి ఓటమి భయం పట్టుకుంది. ఎమ్మార్పీఎస్ బీజేపీకి మద్దతు తెలపడంతో అది కాంగ్రెస్ కే మేలు చేస్తుందని భయపడుతున్నారు. ముప్పై ఏళ్ల క్రితం ప్రారంభం అయిన ఎస్సీ వర్గీకరణ అంశం సుప్రీంకోర్టు తీర్పు కారణంగా మధ్యలోనే ఆగిపోయింది.

తెలంగాణ ఉద్యమం కంటే ముందే ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. దీంతో దాన్ని ఉపయోగించుకుని పలు రాజకీయ పార్టీలు అధికారం దక్కించుకున్నారు. పార్టీలను నమ్మి ఎమ్మార్పీఎస్ ఉద్యమ నాయకుడు మందక్రిష్ణ మాదిగ వారికి మద్దతు ఇచ్చినా ఫలితం దక్కలేదు. ఈ సారి బీజేపీని నమ్ముకున్నారు. వర్గీకరణకు సుముఖత వ్యక్తం చేసిన ప్రధాని మోడీని నమ్మి మాదిగలు బీజేపీకే ఓటు వేయాలని కోరారు.

ఈ నేపథ్యంలో అధికార పార్టీ బీఆర్ఎస్ లో గుబులు రేగుతోంది. మాదిగల ఓటు బ్యాంకు చీలితో అది కాంగ్రెస్ కే ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు. ఈక్రమంలో కాంగ్రెస్ కే ఎక్కువ లాభం కలుగుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో బీజేపీ వల్ల బీఆర్ఎస్ కు పెద్ద నష్టమే జరగనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చిన ఎమ్మార్పీఎస్ చివరి అస్త్రంగా బీజేపీకి సపోర్టు చేయడం సంచలనం కలిగించింది.

బీజేపీకి ఎమ్మార్పీఎస్ మద్దతు ఇచ్చినా దానికి పెద్దగా ప్రాధాన్యం ఉండకపోవచ్చు. కానీ అది బీఆర్ఎస్ కే విఘాతం కలిగించేదిగా ఉంది. మాదిగల మద్దతుతో బీజేపీ హైదరాబాద్ లోనే ఐదు స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎమ్మార్పీఎస్ నిర్ణయంతో బీఆర్ఎస్ కు ఎంత మేర నష్టం కలుగుతుందో తెలియడం లేదు. కానీ బీఆర్ఎస్ లో మాత్రం భయం పట్టుకుందని తెలుస్తోంది.

TAGS