Bigg Boss Sivaji : బిగ్ బాస్ శివాజీ కొడుకు ప్రాణాపాయం లో ఉండడం ఏమిటి ? సోషల్ మీడియా ప్రపంచానికి ఏ మాత్రం పరిచయం లేని ఆయన కుమారుడు ఎప్పుడూ ఎవరినీ పల్లెత్తి ఒక్క మాట అనింది కూడా లేదు, అతనికి ఎవరు బెదిరింపులు చేసి ఉంటారు, ఇలాంటి సందేహాలు ఈ హెడ్ లైన్ ని చూడగానే మీ అందరికీ అనిపించి ఉండొచ్చు. కాని బిగ్ బాస్ శివాజీ నిజమైన కొడుకుకి ఎలాంటి బెదిరింపులు రాలేదు, కాని రీల్ లైఫ్ శివాజీ కొడుక్కి మాత్రం బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా శివాజీ ’90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ అనే వెబ్ సిరీస్ చేసాడు. ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సిరీస్ లో శివాజీ కొడుకులుగా నటించిన మౌళి , రోషన్ కి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.
మౌళి గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యే ప్రతీ ఒక్కరికీ తెలిసే ఉంటుంది. ఇతనొక స్టాండప్ కమెడియన్, ‘మౌళి టాక్స్’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలు చేసాడు. మన జీవితం లో జరిగే ప్రతీ సందర్భానికి సంబంధించి జోక్స్ ని ఇతని యూట్యూబ్ ఛానల్ లో చూడొచ్చు. మీమెర్స్ ఇతని వీడియోస్ ని సందర్భానికి తగ్గట్టుగా తెగ వాడేస్తూ ఉంటారు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా మౌళి ఒక ఈవెంట్ లో స్టాండప్ కామెడీ చెయ్యడం కోసం వెళ్ళాడు. అక్కడ ఆడియన్స్ ని నవ్వించే ప్రక్రియ లో అనేక జోక్స్ వేసాడు.
ఆ జోక్స్ లో ఒకటి ‘ఇప్పుడు నేను మీ అందరికీ ఒక మ్యాజిక్ చేసి చూపిస్తాను. నా చేతిలో ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఉంది, దానిని ఇప్పుడు నేను మాయం చేశాను, కావాలంటే వెళ్లి చెక్ చేసుకోండి మీకు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఎక్కడా కనిపించదు’ అంటూ ఒక జోక్ చేసాడు. దీనికి వైసీపీ ఫ్యాన్స్ నుండి చాలా తీవ్రమైన ట్రోలింగ్స్ మౌళికి ఎదురు అయ్యాయి. నీ అడ్రస్ చెప్పు, నిన్ను చంపేస్తాం అంటూ బెదిరింపులు చేసారు. ఆ తర్వాత మౌళి ఈ నెగటివ్ ట్రోల్ల్స్ మొత్తం చూసి నేను కావాలని ఉద్దేశపూర్వకంగా చెయ్యలేదు ,దయచేసి నన్ను క్షమించండి అంటూ పోస్ట్ చెయ్యడం తో అందరూ శాంతించారు.