Bigg Boss Ashwini : ఏంటి.. బిగ్ బాస్ అశ్వినికి ఆల్రెడీ పెళ్లి అయి విడాకులు అయ్యాయా..?

Bigg Boss Ashwini

Bigg Boss Ashwini Smile

Bigg Boss Ashwini Divorced  : ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్-7 ట్రెండ్ నడుస్తోంది. అయితే ఇందులో ఉన్న కంటెస్టెంట్లకు సంబంధించిన విషయాలు కూడా అదే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. కాగా ఇప్పుడు అశ్విని శ్రీ గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఆమె గురించి చాలామందికి పెద్దగా తెలియదు. ఆమె కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది.

అమీర్ పేట్ లో, బీటెక్ బాబులు, నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్ లాంటి చిన్న సినిమాల్లో నటించింది. కానీ అవేమంత పెద్దగా ఆడలేదు. దాంతో ఆమెకు పెద్దగా క్రేజ్ రాలేదు. అదే సమయంలో మరికొన్ని సినిమాల్లో సపోర్టివ్ క్యారెక్టర్స్ తో కూడా అలరించింది. ఇక ఈ క్రమంఓలనే బిగ్ బాస్ ఛాన్స్ రావడంతో అందులోకి వచ్చింది. అయితే ఆమె చదువు పరంగా చాలా బెటర్.

వరంగల్ లోని నిట్ లో బీటెక్ పూర్తి చేసింది. ఆమె ఇండస్ట్రీలోకి వెళ్తాన్ని చెప్పడంతో భయపడిపోయిన ఆమె పేరెంట్స్.. ఆమెకు ఏం వద్దని చెప్పి వెంటనే 2013లోనే పెళ్లి చేశారంట. కానీ ఆమెకు ఇష్టం లేని పెండ్లి చేసుకున్న అశ్విని.. అతనితో ఉండలేక విడాకులు ఇచ్చేసిందంట. అప్పటి నుంచి ఆమె సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేసింది.

వరుసగా సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్ కావాలని అనుకుంది. కానీ ఆమెకు అదృష్టం పెద్దగా కలిసి రాలేదు. అందుకే చిన్న సినిమాల్లో నటించడం స్టార్ట్ చేసిందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు గానీ.. చాలా మంది నిజమే అని కామెంట్లు కూడా చేస్తున్నారు. చూడాలి మరి ఆమె ఏమైనా స్పందిస్తుందో లేదో.

TAGS