Balayya Wife : బాలయ్య సతీమణి వసుందర దేవికి బాగా ఇష్టమైన బాలకృష్ణ సినిమా అదేనా..?
Balayya Wife : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నిన్నటి తరం హీరోలలో టాప్ 2 స్టార్స్ లో ఒకడిగా విపరీతమైన మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో కొనసాగిన హీరో నందమూరి బాలకృష్ణ. ఒక విధంగా చెప్పాలంటే టాలీవుడ్ లో మాస్ అనే పదానికి సరికొత్త నిర్వచనం తెలిపింది బాలయ్య బాబే. ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ కూడా, బాలయ్య కెరీర్ ప్రారంభం లోనే తనదైన మార్కుని ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్టీఆర్ రాజకీయ పర్యటన బిజీ గా ఉన్న సమయంలో బాలయ్య కి వసుందర దేవి తో వివాహం అయ్యింది.
‘చైతన్య రధం’ యాత్ర లో ఉన్న ఎన్టీఆర్ ఈ పెళ్ళికి హాజరు కాలేకపోయాడని మన అందరికీ తెలిసిందే. పెళ్ళైన తర్వాత వీళ్లిద్దరి దాంపత్య జీవితం ఎంతో అన్యోయంగా కొనసాగి, కొత్తగా పెళ్ళైన వారికి ఆదర్శంగా నిల్చింది. వీళ్లిద్దరికీ ఒక కొడుకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కూతుర్లు వసుంధర, తేజస్విని కి పెళ్లిళ్లు అయిపోగా, కొడుకు మోక్షజ్ఞ తేజ అతి త్వరలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
ఇదంతా పక్కన పెడితే వసుందర దేవి ఎక్కువగా మీడియా ముందు కనపడడం ఇన్నేళ్ళలో ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడైనా పెళ్లిళ్లకు బాలయ్య తో కలిసి కనిపిస్తుంది కానీ, మిగిలిన సందర్భాలలో ఆమె మీడియా ముందుకు రావడం చాలా తక్కువ. అయితే వసుంధర గురించి బాలయ్య బాబు పలు సందర్భాలలో కొన్ని ఇంటర్వూస్ లో చెప్తూ ఉంటాడు.ఇది ఇలా ఉండగా బాలయ్య కెరీర్ లో ఆమెకి బాగా ఇష్టమైన సినిమా ఏమిటని బాలయ్య ని ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ అడగగా, ఆమెకి సమరసింహారెడ్డి సినిమా అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. చూసేందుకు వసుంధర చాలా సాఫ్ట్ గా కనిపిస్తుంది కానీ, ఆమె ఎక్కువగా మాస్ యాక్షన్ సినిమాలనే చూస్తుందట. ఫ్యామిలీ డ్రామా సినిమాలు చాలా తక్కువగా చూస్తుందట.
బాలయ్య కెరీర్ లో సూపర్ హిట్ గా నిల్చిన చిత్రాలలో ఆమె ఎక్కువగా మాస్ సినిమాలనే చూసేడట. ఇకపోతే రీసెంట్ గానే ‘భగవంత్ కేసరి’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న బాలయ్య, ప్రస్తుతం బాబీ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా సాగుతుంది. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత బాబీ తీస్తున్న సినిమా కావడం తో ఈ మూవీ పై ప్రారంభ దశ నుండే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.