Arjun Tendulkar : అర్జున్ టెండూల్కర్ భయపడ్డాడు అని ట్రోలర్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. సచిన్ టెండూల్కర్ కొడుకుగా ఎన్నో అంచనాలతో బరిలోకి దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్న అర్జున్ కు ఏదీ కలిసి రావడం లేదు. ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ గత మూడు సీజన్ లుగా అర్జున్ టెండూల్కర్ ను రూ. 20 లక్షలకు కొనుగోలు చేస్తూనే ఉంది.
గత సీజన్ లో రెండు మ్యాచుల్లో అవకాశం ఇచ్చిన ముంబయి యాజమాన్యం ఈ సారి చివరి లీగ్ మ్యాచ్ లో ఆడేందుకు సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ కు చాన్స్ కల్పించింది. అర్జున్ 2.2 ఓవర్లలోనే 22 పరుగులు ఇచ్చి గాయమైందని వెళ్లి డగౌట్ లో కూర్చున్నాడు. అయితే 2 ఓవర్లు బాగానే బౌలింగ్ చేసిన అర్జున్ మూడు ఓవర్ కు వచ్చేసరికి నికోలస్ పూరన్ మొదటి రెండు బంతుల్లో రెండు సిక్సులు బాదాడు.
దీంతో కావాలనే భయపడి అర్జున్ వెళ్లిపోయాడని కామెంట్స్ చేస్తున్నారు. అర్జున్ టెండూల్కర్ గాయం కాకుండానే బయటకు వెళ్లిపోయాడని అనుకుంటున్నారు. దీనిపై నెట్టింట బాగా ట్రోల్స్ అవుతున్నాయి. సచిన్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని గ్రేట్ బ్యాటర్ గా నిలుస్తాడని అనుకున్న ప్రతి ఒక్కరిని అర్జున్ నిరాశపరుస్తున్నాడు.
అర్జున్ మొదటి రెండు ఓవర్లు సూపర్బ్ గా బౌలింగ్ చేశాడు. ప్రపంచ స్థాయి గ్రేట్ బ్యాటర్ అయినా మార్కస్ స్టోయినిస్ ను బెంబేలేత్తించాడు. స్వింగ్, యార్కర్, షార్ట్ పిచ్ బంతులు వేసి ఇబ్బందులకు గురి చేశాడు. బుమ్రా స్థానంలో చోటు దక్కించుకున్న అర్జున్ తొలి రెండు ఓవర్లు ఆ లోటు లేకుండా చేశాడు.
ఒక దశలో ఎల్బీ అవుట్ గా స్టోనియిస్ వెనుదిరిగినా.. రిప్లే లో బంతి వికెట్ల కంటే పైకి వెళుతుందని తేలడంతో నాటౌట్ గా ప్రకటించారు. మొదటి రెండు ఓవర్లు చాలా అగ్రెసివ్ గా బౌలింగ్ చేసిన అర్జున్ కు తర్వాత 15 వ ఓవర్ లో చాన్స్ వచ్చింది. కానీ నికోలస్ పూరన్ రెండు బంతుల్లో రెండు సిక్సులు కొట్టగానే డగౌట్ కు వెళ్లి కూర్చున్నాడు. దీంతో అతడు భయపడ్డాడని అందరూ అంటున్నారు.