JAISW News Telugu

Iran Attack : పాకిస్తాన్ పై ఇరాన్ దాడి..? ఎందుకు చేసింది? అసలేంటి కారణం?

Iran Attack

Iran Attack

Iran Attack : ఇండియా నుంచి విడిపోయి వేరే దేశంగా ఏర్పడ్డ పాకిస్తాన్.. నేడు ఓ విఫల దేశంగా కొనసాగుతోంది. భారత్, పాకిస్తాన్ స్వాతంత్ర్యం ఒకే రోజు తెచ్చుకున్నా.. భారత్ పలుకుబడి ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతుంటే.. పాకిస్తాన్ మాత్రం ఒక అపనమ్మకమైన దేశంగా ప్రతిష్ఠను కోల్పోతోంది.

తాజాగా పాకిస్తాన్, ఇరాన్  మధ్య విభేదాలు వచ్చాయి. వివరాలిలా ఉన్నాయి..   తమ భూభాగంలోని తీవ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడి చేశామంటూ ఇరాన్ చేసిన ప్రకటనను పాకిస్తాన్ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి చర్యలకు తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఈ దాడుల్లో ఇద్దరు పిల్లలు మృతి చెందినట్టు తెలిపింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్టు పేర్కొంది. ఇరాన్ చర్యలను ఖండిస్తూ ఆ దేశ రాయబారిని పిలిపించుకుని పాక్ విదేశాంగ కార్యాలయం తమ నిరసనను తెలియజేసింది. పాక్ గగనతలాన్ని దుర్వినియోగం చేస్తూ.. దేశ సార్వభౌమాధికారాన్నే సవాల్ చేశారని ఆక్షేపించింది.

ఇరుదేశాల మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి వ్యవస్థాపిత మార్గాలున్నాయని పాకిస్తాన్ గుర్తు చేసింది. అయినప్పటికీ ఇరాన్ ఇలా దాడులు చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామని పేర్కొంది. దాడులు సరిగ్గా ఎక్కడ జరిగాయనే విషయాన్ని మాత్రం పాక్ వెల్లడించలేదు. ‘‘ ఉగ్రవాదం అన్ని దేశాలకూ తీవ్ర ముఫ్పు తలపెడుతోంది. దీన్ని కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం పొరుగు దేశాల మధ్య సత్సంబంధాలను ప్రతిబింబించడం లేదు. ద్వైపాక్షిక బంధాన్ని తీవ్రంగా దెబ్బతీసేలా మీ చర్యలున్నాయి.’’ అని ఇరాన్ పై పాక్ మండిపడింది.

బలూచిస్థాన్ ప్రాంతంలో తీవ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశామని మంగళవారం ఇరాన్ ప్రకటించింది. జైష్ ఆల్ అదిల్ ఉగ్రసంస్థకు చెందిన రెండు ప్రధాన కార్యాలయపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడినట్టు వెల్లడించింది. జైష్ ఆల్ అదిల్ సున్నీ మిలిటెంట్ గ్రూపు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తూ ఇరాన్ లోని సిస్థాన్- బలూచిస్థాన్ లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

Exit mobile version