T20 World Cup : ఐపీఎల్ లో ఎంత ఆడినా.. టీ 20 వరల్డ్ కప్ టీం లో చోటు దక్కేనా..

T20 World Cup

T20 World Cup, Young IPL Players

T20 World Cup : ఐపీఎల్ 16 వ ఎడిషన్ లో చాలా మంది ఇండియన్ యువ బ్యాటర్లు, బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. విదేశీ ఆటగాళ్ల ఫర్ఫామెన్స్ కంటే యువ సంచనాల ఆటతీరు ఎంతో ఆకట్టుకుంటుంది. అయితే ఐపీఎల్ లో రియాన్ పరాగ్, శివం దూబె, యయంక్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, రాణించి అంచనాలు పెంచుతుంటే వీరికిి పోటీగా దినేశ్ కార్తీక్ రెఢీ అయ్యాడు.

అయితే వరల్డ్ కప్ జట్టుకు ఇప్పటికే ఫుల్ స్ట్రెంత్ ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఆడనుండగా.. విరాట్ కోహ్లిని తీసేయలేరు. హర్దిక్ పాండ్యా, సూర్య కుమార్, రింకూ సింగ్, తిలక్ వర్మ, యశస్వి జైశ్వాల్  గత సిరీస్ ల్లో ఆడిన వారే. మరి ఇలాంటిి సందర్భంలో యువకులను జట్టుకు ఎంపిక చేయడం కష్టమే అనుకుంటున్నారు. ఎంత రాణించినా ఈ సారి సెలక్టర్లు కరుణ చూపకపోవచ్చని క్రిిికెట్ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

యయాంక్ యాదవ్ 150 స్పీడ్ తో బంతులు వేస్తూ ఆకట్టుకుంటున్నాడు. రియాన్ పరాగ్ నిలకడ ఆటతీరుతో రాజస్థాన్ రాయల్స్ కు వెన్నెముకగా మారాడు. అయినా వీరి పై అంచనాలు పెంచుకుంటున్నారు అభిమానులు. యశస్వి జైశ్వాల్ ఫామ్ లో లేకపోవడం తప్పా ప్రతి విషయంలో యువకులు అంచనాలను మించి రాణిస్తున్నారు. కానీ సెలెక్టర్లు మాత్రం ఈ సారి హర్దిక్ ను కాకుండా రోహిత్ శర్మనే టీ 20 కెప్టెన్ గా నియమిస్తారని సంకేతాలు ఇచ్చారు.

వరల్డ్ కప్ లో ఓటమి అనంతరం ఎలాగైనా ఈ సారి పొట్టి ప్రపంచ కప్ అందుకోవాలని రోహిత్ తహతహలాడుతున్నాడు. 2007 లో గౌతం గంభీర్ వీరోచిత ఇన్నింగ్స్ లో టీ 20 వరల్డ్ కప్ అందుకున్న ఇండియా, ఈ సారైనా పొట్టి ప్రపంచకప్ ను పట్టేస్తుందా. చూడాలి. బౌలింగ్ విభాగాన్ని మెరుగు పరుచుకుంటే చాలు టీ 20 వరల్డ్ కప్ ఇండియా సొంతమవడం ఖాయంగా కనిపిస్తోంది.

TAGS