JAISW News Telugu

IPL : నేటి నుండి ఐపీఎల్ ప్రారంభం

IPL 2025 : క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నేటి నుండి ప్రారంభం కానుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగే ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. దీనిని స్టార్ స్పోర్ట్స్ ఛానల్ మరియు జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్షంగా చూడవచ్చు. ఈ సీజన్‌లో ఏ జట్టు విజేతగా నిలుస్తుందో మీ అభిప్రాయాలను తెలియజేయగలరు.

Exit mobile version