IPL 2024: ప్లేఆఫ్స్ కు వెళ్లే ఆ నాలుగు జట్లు ఇవేనా? రచ్చ మొదలైంది బ్రో..
IPL 2024 : ఐపీఎల్ సంరంభానికి వేళైంది. చెపాక్ వేదికగా మార్చి 22న(రేపు) ఐపీఎల్ సీజన్ 17 మొదలుకానుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోరుతో ఈ సీజన్ షురూ కానుంది. సార్వత్రిక ఎన్నికల కారణంగా తొలి 17 రోజులకు సంబంధించిన షెడ్యూల్ మాత్రమే విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 21 మ్యాచ్ లు నిర్వహించనున్నారు. మార్చి 22న ప్రారంభమయ్యే ఈ సీజన్ ఏప్రిల్ 7 వరకు మాత్రమే షెడ్యూల్ ప్రకటించారు.
భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం జరిగే మ్యాచ్ లు 3.30కు, రాత్రి జరిగే మ్యాచ్ లు 7.30కు ప్రారంభమవుతాయి. స్టార్ స్పోర్ట్స్(టెలివిజన్), జియా సినిమాస్ (డిజిటల్) లో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది.
ప్రారంభ మ్యాచ్ జరిగే జట్ల వివరాలివి:
చెన్నై సూపర్ కింగ్స్:
ధోని(కెప్టెన్), మొయిన్ అలీ, దీపక్ చహర్, తుషార్ దేశ్ పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేశ్ చైదరి, అజింక్య రహానే, షేక్ రషీద్, మిచెట్ సాంటర్న్, సిమరజీత్ సింగ్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సొలంకి, మహీశ్ తీక్షణ, రచిన్ రవీంద్ర శార్దూల్ ఠాకూర్, డారిల్ మిచెట్, సమీర్ రిజ్వీ, ముస్తాఫిజుర్, రెహమాన్, అవనీష్ రావు అరవెల్లి
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్:
ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), గ్లెన్ మాక్స్ వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనూజ్ రావత్, దినేశ్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయి, విల్ జాక్స్, మహిపాల్ లామ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్ కుమార్ వైశాక్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరూన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దాయాల్, టామ్ కరాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్ , సౌరవ్ చౌహాన్.
ఇదిలా ఉండగా ఈ సీజన్ లో కప్ కొట్టడమే లక్ష్యంగా 10 జట్లు గ్రౌండ్ లోకి దిగబోతున్నాయి. అయితే పాయింట్ల పట్టికలో టాప్-4 లో నిలిచిన జట్లే ప్లేఆఫ్స్ కు చేరుతాయి. ఇప్పటికే క్రికెట్ అభిమానుల్లో సంతోషం కట్టలు తెంచుకొంటోంది. తమ ఆరాధ్య ఆటగాళ్లు, జట్లే విజయం సాధిస్తాయని ట్వీట్ చేస్తున్నారు. ఈ ఆటగాడు ఎక్కువ పరుగులు తీస్తాడు..ఆ ఆటగాడు ఎక్కువ వికెట్లు తీస్తాడు.. ఈ జట్లు ప్లే ఆఫ్స్ కు వెళ్తాయి.. అంటూ నెట్టింట చర్చ జరుగుతోంది. ఇక కొందరైతే ప్లేఆఫ్స్ కు వెళ్లే జట్లు ఏవంటూ పోల్ కూడా పెడుతున్నారు. మొత్తానికైతే దేశంలో ఎన్నికల వాతావరణంతో పాటు క్రికెట్ ఫీవర్ కూడా ఆకాశన్నంటుతోంది. ఇక సమ్మరంతా దేశంలో సందడే సందడి అని మాత్రం చెప్పవచ్చు.