IPL 2024 : సన్ రైజర్స్ కెప్టెన్ గిరికి భారీ గిరాకీ.. ఆ ముగ్గురిలో మార్ క్రమ్ వారుసుడెవరో?
Aiden Markram : గత ఐపీఎల్ సీజన్ లో పరాజయాల నుంచి కోలుకోని కొత్త సీజన్ ను సానుకూలంగా మొదలు పెట్టడానికి సన్ రైజర్స్ హైదరాబాద్ రెడీ అవుతోంది. గత సీజన్ లో కెప్టెన్ గా ఎంచుకున్న దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ మార్ క్రమ్ జట్టును ముందుండి నడిపించడంలో విఫలమయ్యాడు. దీంతో సన్ రైజర్స్ పేలవ ప్రదర్శనతో లీగ్ దశలోనే ఇంటి బాట పట్టింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ విషయంలో ఆ జట్టు తీవ్రంగా ఆలోచిస్తోంది.
ప్రస్తుతం జట్టులో కెప్టెన్సీ చేపట్టగలిగే ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటికే తమ జాతీయ జట్టు తరుపున మెరుగైన ప్రదర్శనతో రాణిస్తుండడంతో పాటు కెప్టెన్సీ చేపట్టగలిగే కెపాసిటీ ఉన్న వారు ముగ్గురు ఉన్నారు. వీరిలో ఎవరినీ కెప్టెన్సీ గిరి వరించబోతుందా అనే విషయం ఉత్కంఠకు గురిచేస్తోంది. అయితే వీళ్లెవరినీ కాదని మార్ క్రమ్ కొనసాగించే అవకాశాలు కూడా లేకపోలేదు.
మార్ క్రమ్ కాకపోతే జట్టులో కెప్టెన్సీ చేపట్టే వారిలో ముగ్గురు ఆటగాళ్లను పరిశీలిస్తే.. గతేడాది ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపిక కావడంతో పాటు ఆస్ట్రేలియాకు ప్రపంచ టెస్ట్ చాంపియన్ కప్ ను, వన్డే ప్రపంచ కప్ ను అందించిన పాట్ కమ్మిన్స్ ఇప్పుడు సన్ రైజర్స్ కు బెస్ట్ ఆప్షన్ గా ఉన్నాడు. ఈసారి అతన్ని రూ.20.50 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం.
కమ్మిన్స్ తర్వాత వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆసిస్ విజయంలో కీలకపాత్ర పోషించిన ట్రావిస్ హెడ్ కూడా మరో ఆప్షన్ గా కనిపిస్తున్నాడు. ఇతడు ఆల్ రౌండర్ కూడా. దీర్ఘకాలిక అవసరాల మేరకు చూస్తూ ఇతడు కూడా బెస్ట్ ఆప్షనే. అలాగే భారత మాజీ బౌలర్ కూడా ఈ రేసులో ఉన్నారు. గతంలో సన్ రైజర్స్ కెప్టెన్, వైస్ కెప్టెన్ గా కూడా వ్యవహరించిన భువీ..మార్ క్రమ్ కు ముందు జట్టును నడిపించాడు.