JAISW News Telugu

IPL 2024 : ఐపీఎల్ 2024 షెడ్యూల్ నేడే.. ఎన్నికలు ఉన్నా ఆగదు : టోర్నీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు

IPL 2024

IPL 2024

IPL 2024 : క్రికెట్ ఫ్యాన్స్ ఐపీఎల్ ధమాకా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమ్మర్ ను మరింత రంజుగా ఎంజాయ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈతరుణంలో ఐపీఎల్ 2024 షెడ్యూల్ ప్రకటించేందుకు బీసీసీఐ రెడీ అయ్యింది. షెడ్యూల్ ప్రకటనకు డేట్, టైమ్ కూడా ఫిక్స్ చేసింది.

ఐపీఎల్ 17వ సీజన్ కు కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది దేశంలో లోక్ సభ ఎన్నికలు జరుగనుండడంతో అందుకు అనుగుణంగా టోర్నీని నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటోంది. మార్చి 22వ తేదీన ఐపీఎల్ 2024 టోర్నీ మొదలవుతుందని టోర్నీ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ఈ తరుణంలో ఐపీఎల్ 2024 తొలి దశ షెడ్యూల్ ప్రకటించేందుకు బీసీసీఐ సిద్ధమైందని సమాచారం బయటకు వచ్చింది. షెడ్యూల్ అనౌన్స్ మెంట్ కు డేట్ ,టైమ్ కూడా ఫిక్స్ చేసిందని తెలుస్తోంది.

ఐపీఎల్ 2024 తొలి దశ షెడ్యూల్ ను బీసీసీఐ నేడు (ఫిబ్రవరి 22) ప్రకటిస్తుందని సమాచారం బయటకు వచ్చేసింది. ఇందుకు అన్ని ఏర్పాట్లను బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికలు ఉండడంతో ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్ ల తేదీలపై బీసీసీఐ తర్జనభర్జన పడుతోంది. ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ తేదీని బట్టి అక్కడి వేదికల్లో మ్యాచ్ లు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. ఈ తరుణంలో ఈ ఏడాది ఐపీఎల్ షెడ్యూల్ ను రెండు దశల్లో ప్రకటించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ముందుగా 15 రోజుల మ్యాచ్ షెడ్యూల్ ను బీసీసీఐ ఇవాళ(22న) ప్రకటిస్తుందని తెలుస్తోంది. మార్చి 22న ఐపీఎల్ 2024 ప్రారంభం కానుండడం ఖాయంగా కనిపిస్తోంది.

లోక్ సభ ఎన్నికలు ఉన్న తరుణంలో ప్రభుత్వం, సంస్థలతో సమన్వయం చేసుకుంటూ మ్యాచ్ ల తేదీలను డిసైడ్ చేస్తామని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఇటీవలే చెప్పారు. ఎన్నికలు ఉన్నా ఈసారి ఇండియాలో టోర్నీ నిర్వహిస్తామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Exit mobile version