JAISW News Telugu

IPL 2024 : ఎంత కొట్టినా.. గెలుస్తామన్న నమ్మకం లేదు

IPL 2024

IPL 2024

IPL 2024 : ఐపీఎల్ సీజన్లలో ఇంతవరకు కనివీని ఎరుగని రీతిలో ఆయా జట్లు బ్యాటింగ్ లో దంచి కొడుతున్నాయి. ఒకప్పుడు 200 పరుగులు చేస్తే భారీ స్కోరు. ఇక విజయం మనదే అనే ధీమాతో బౌలింగ్ కు దిగేవారు. ప్రస్తుత సీజన్ లో సీను రివర్స్ అయింది. సన్ రైజర్స్ బాదుడుకు లెక్కే లేకుండా పోయింది. బౌలర్లపై ఏమాత్రం కనికరం లేకుండా బాదేస్తున్నారు. ఢిల్లీతో మ్యాచ్ లో అయితే పవర్ ప్లేలో నే కేవలం 36 బంతుల్లో 125 పరుగులు చేశారంటే ఎంతలా విధ్వంసం చేశారో అర్థం చేసుకోవచ్చు.

సన్ రైజర్స్ ఈ సీజన్ లో కోల్ కతాపై 204, ఆర్సీబీపై 287, ముంబయిపై 277, ఢిల్లీపై 266 పరుగుల భారీ స్కోరు చేసింది. రాజస్థాన్ రాయల్స్ కోల్ కతాపై 224 పరుగుల టార్గెట్ ఛేజ్ చేసి ఔరా అనిపించుకుంది. ఆర్సీబీ సన్ రైజర్స్ మ్యాచ్ తో ఛేజింగ్ లో 265 పరుగులు చేసి ఔరా అనిపించుకుంది. ముంబయి కూడా సన్ రైజర్స్ తో ఛేజింగ్ లో దుమ్ము రేపి 243 పరుగులు చేసి భయపెట్టింది.

ఇప్పటివరకు  ప్రపంచ టీ 20 క్రికెట్ చరిత్రలోనే కొన్ని వేల మ్యాచ్ లు జరిగి ఉంటాయి. అయితే ఇంతవరకు  టీ20 ల్లో 200కు పైగా టార్గెట్ చేసి విజయం సాధించిన మ్యాచ్ లు కేవలం 23 మాత్రమేనని కెవిన్ పీటర్సన్ తన కామెంట్రీ సమయంలో అన్నాడు.  అంటే ఛేజింగ్ అంతా సులువు కాదని అర్థం అవుతుంది.

అయితే ఈ ఐపీఎల్ లో తీసుకొచ్చిన ఇంఫాక్ట్ ప్లేయర్ నిబంధన, ఎక్స్ ట్రా బ్యాట్స్ మెన్ ద్వారా బౌలింగ్ టీంకు కఠిన పరీక్ష ఎదురవుతోంది.  అయితే బౌలింగ్ చేసే టీంలు మాత్రం మొదట ఎంత భారీ స్కోరు చేసినా భయపడక తప్పని పరిస్థితి. చిన్న స్టేడియాలు, బౌండరీలు దగ్గరగా ఉండడం.. బ్యాటింగ్ పిచ్ లతో బౌలర్లను ఊచకోత కోస్తున్నారు. ఈ ఇంఫాక్ట్ ప్లేయర్ విధానం నచ్చడం లేదని రోహిత్ శర్మ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు.

దీంతో ఇండియా టీంలోకి రావాలనుకుంటున్న శివం దూబె, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్ రౌండర్లు డ్రెస్సింగ్ రూంకే పరిమితమవుతున్నారని ఇది టీం ఇండియా క్రికెట్ కు మంచిది కాదన్నాడు.

Exit mobile version