IPL 2024 Final : చెన్నైలో సన్ రైజర్స్ చమక్..   ఫైనల్ కు దూసుకెళ్లిన కమిన్స్ సేన

IPL 2024 Final

IPL 2024 Final

IPL 2024 Final : క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆల్ రౌండ్ పర్పామెన్స్ తో ఫైనల్ కు దూసుకెళ్లింది. క్వాలిఫైయర్ 2 మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ పై 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదటి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ కు ఆదిలోనే షాక్ తగిలింది. సన్ రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ సిక్సు, ఫోర్ బాది మొదటి ఓవర్ లోనే బౌల్ట్ బౌలింగ్ లోనే వెనుదిరిగాడు.

ట్రావిస్ హెడ్ సమయోచిత బ్యాటింగ్ తోో 32 పరుగులు చేశాడు. కీలక సమయంలో వికెట్లు పడుతున్నా… క్లాసెన్ వీరోచిత ఇన్సింగ్స్ ఆడి 50 పరుగులు చేశాడు. 34 బంతుల్లోనే నాలుగు సిక్సుల సాయంతో 50 పరుగులు చేసి సన్ రైజర్స్ కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. సన్ రైజర్స్ 175 పరుగులు చేసి ఇన్సింగ్స్ ముగించింది.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ బ్యాట్స్ మెన్ కు భువీ, కమిన్స్ మొదటి నాలుగు ఓవర్లు నిప్పులు చెరిగే బంతులు వేసి యశస్వి జైశ్వాల్, కడ్ మోర్ ను ముప్పుతిప్పలు పెట్టారు. ఆ తర్వాత గేర్ మార్చిన యశస్వి జైశ్వాల్ ఫోర్లు, సిక్సులతో చెలరేగి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే అభిషేక్ శర్మ, షాబాద్ ను   దించిన కమిన్స్ తాను అనుకున్నది సాధించాడు.

21 బాల్స్ లోనే  42 పరుగులు చేసిన  యశస్వి జైశ్వాల్ ను షాబాద్ ఔట్ చేయడంతో 62 పరుగులకు రెండో వికెట్ కోల్పోయింది. వెంటనే కెప్టెన్ సంజు శాంసన్ ను అభిషేక్ శర్మ అవుట్ చేశాడు. దీంతో 63 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అనంతరం పరాగ్, హిట్ మెయిర్,పావెల్ ను వెంట వెంటనే అవుట్ చేయడంతో సన్ రైజర్స్ గెలుపు ఖాయమైంది. అయితే ద్రువ్ జురెల్ మాత్రం ఒక్కడే చివరి వరకు పోరాడినా అంతరాన్ని తగ్గించడే కానీ గెలిపించలేకపోయాడు.

TAGS