Sonia Gandhi : తెలంగాణలో ఎన్నికల ఘట్టం ముగిసింది. రాష్ట్ర అభివృద్ధి పై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిసారించిది. కొన్ని నిర్ణయాలు తీసుకోడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి కోరింది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల కమిషన్ అనుమతితో మంత్రి వర్గం సమావేశమైనది. సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకొంది మంత్రి మండలి. ముక్యంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి మంత్రివర్గం ఆమోదించింది. అన్ని పార్టీలకు ఆహ్వాన పత్రికలు పంపాలని నిర్ణయం తీసుకున్నారు.
జూన్ రెండున నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీని ఆహ్వానించాలని మంత్రులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ ఆగష్టు 15న చేసితీరుతామని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో స్పష్టం చేశారు. ఆ హామీని నిలబెట్టుకునేందుకు తెలంగాన సంబరాలను వేదిక చేసుకున్నట్టు సమాచారం. ఆ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించారు. ప్రతిపక్షాలను దెబ్బకొట్టడానికే సోనియా గాంధీ చేతుల మీదుగా రైతు రుణమాఫీ పథకాన్ని అమలుచేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ట్ తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్దిపొందానికి బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు రుణమాఫీ పథకాన్ని ఆయుదంగా ఎంచుకున్నాయి. కాంగ్రెసును దెబ్బకొట్టడానికి ప్రతి సభలో రుణమాఫీ అంశాన్ని లేవనెత్తాయి. అందుకు దీటుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించి ఆగష్టు 15 లోగ రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించి ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. అవతరణ వేడుకలకు సోనియా గాంధీ ని పిలిచి ఆమె చేతుల మీదుగా రుణమాఫీ పథకాన్ని అమలు చేయాలనీ మంత్రి మండలి నిర్ణయించింది.
అదేవిదంగా ప్రతిపక్ష నాయకులను పిలవడంలో కూడా తేడా చూపరాదని, ప్రతి ఒక్కరికి ఆహ్వాన లేఖలు పంపాలని మంత్రి మండలి నిర్ణయించింది. అవతరణ వేడుకల్లో గత ప్రభుత్వం చేసిన పొరపాట్లకు అవకాశం ఇవ్వరాదని నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలలను జూన్ 12 నాటికి విద్యార్థులకు అనుకూలంగా తీర్చి దిద్దాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. విద్యార్థులకు అసౌకర్యం ఎక్కడ కూడా ఉండరాదన్నారు. అదే విదంగా తడిసిన ధాన్యంను కొనే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకొంది. ప్రతి జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో నే రైతుల ధాన్యం కొనుగోలు జరిగే విదంగా చర్యలు తీసుకొంది మంత్రి మండలి. తడిసిన ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు అనుమానపడాల్సిన అవసరంలేదని మంత్రి వర్గం స్పష్టం చేసింది.