The Last Hour : ఓటీటీలో డిఫరెంట్ జానర్లు బాగానే వస్తుంటాయి. ఓటీటీలు వరల్డ్ వైడ్ గా ఉండడంతో అన్ని భాషలకు చెందినవి స్ట్రీమ్ అవుతుంటాయి. స్పై, థ్రిల్లర్, హార్రర్ జానర్లకు రేటింగ్, అభిమానులు ఎక్కువగా ఉంటుండడంతో ఓటీటీ ప్లాట్ ఫారంలే వారిని స్వయంగా నిర్మిస్తున్నాయి. నిర్మించడమే కాదు. చాలా భాషల్లో డబ్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నాయి. ఇందులో ఆత్మలతో ఇన్వెస్టిగేషన్ చేసే సిరీస్ను ఎక్కడైనా చూశారా? హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించిన ఈ సిరీస్ రెండేళ్ల క్రితం అమేజాన్ లో స్ట్రీమింగ్ లోకి వచ్చింది. దాని వివరాలను తెలుసుకుందాం..
ఓటీటీలో వచ్చిన చాలా రకాల వెబ్ సిరీస్ లలో ఈ సిరీస్ ల ప్రత్యేకత వేరని ఆడియెన్స్ కితాబిస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఎపీసోడ్ నుంచి లాస్ట్ ఎపీసోడ్ వరకు ఉత్కంఠంగా సాగుతూ సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతోంది. దీని పేరు ‘ది లాస్ట్ అవర్’. ఈ సిరీస్లో సంజయ్ కపూర్, కర్మ తకాపా, షేలీకే లీడ్ రోల్స్ లో కనిపించారు.
న్యాచురల్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్గా ‘ది లాస్ట్ అవర్’ 2021లో రిలీజైంది. ఇందులో మొత్తం 8 ఎపీసోడ్‌లు ఉన్నాయి. ఒక్కో ఎపీసోడ్ అరగంట ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ సీన్స్ బాగున్నాయి. పోలీస్ అధికారులకు దొరకకుండా హంతకుడు వరుసగా హత్యలు చేయడం, వాడిని కనిపెట్టలేక, పట్టుకోలేక అధికారులు కిందా, మీద పడడం ప్రజలు తన ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని భయంగా బతకడం.. ఇలా సిరీస్ మొత్తం ఇంటెన్స్గా సాగుతూ థ్రిల్ పంచుతోంది.
ఒక్కో ఎపీసోడ్కు ఇన్వెస్టిగేషన్ స్పీడ్ పెంచుతూ పోవడం, ఆత్మలతో మాట్లాడడం లాంటి అంశాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. మంచి ఎక్స్‌పీరియన్స్థ్రిల్ ఇచ్చే ఈ సిరీస్అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథేంటంటే..?
ముంబైలో ఉండే పోలీస్ అధికారి అరుప్ (సంజయ్ కపూర్)ను ఓ బెంగాలీ నటి మర్డర్ కేస్ ఛేదించేందుకు ఈశాన్య రాష్ట్రానికి బదిలీ చేస్తారు. అక్కడ వరుస హత్యలు జరుగుతుంటాయి. ఎవరు..? ఎందుకు చేస్తున్నారు..? హంతకుడి మోటో ఏంటి..? అని తెలియక పోలీసులు సతమతం అవుతుంటారు. ఈ క్రమంలో అరుప్ ఇన్వెస్టిగేషన్ లో తనకు సాయంగా దేవ్ (కర్మా తపాకా)ను జాయిన్ చేసుకుంటాడు. దేవ్కు ఒక అద్భుతమైన శక్తి ఉండడంతో కథ చిక్కు ముడులు వీడుతూ ముందుకు సాగుతుంది.
లోకాన్ని వీడకుండా తిరుగుతున్న ఆత్మలతో మాట్లాడి వాటి కోరిక తీర్చి స్వేచ్ఛను కలిగించి మరో లోకానికి పంపిస్తుంటాడు దేవ్. ఈ ఆత్మలతో మాట్లాడడమే కేసు ఛేదించేందుకు తోడ్పడుతుంది. హత్యలు చేసేది కూడా సూపర్నేచురల్ శక్తులు ఉన్న వారేనన్న అనుమానాలు రేకెత్తుతాయి. ఆత్మల సాయంతో హంతుకుడిని ఎలా పట్టుకుంటారు? కేసును ఛేదించారా..? అన్నదే ది లాస్ట్ అవర్ సిరీస్ కథ.