Ex-Minister Roja : రోజా వీక్లీ తిరుమల పర్యటనపై విచారణ?
Ex-Minister Roja : బాబు ఏపీ సీఎంగా చార్జి తీసుకున్న తర్వాత మొదటి పర్యటన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. జగన్ రూపంలో ఉన్న సంకటాలను తొలగించావని, ఇక రాష్ట్రాన్ని దేశంలో నెం. 1 పొజిషన్ కు నీవే తీసుకెళ్లాలని స్వామి వారిని వేడుకున్నారు.
వైసీపీ అరాచక పాలన అంతం అయ్యిందని ఇక, ఏపీలో రామ రాజ్యం రావాలని, అలా స్వామి వారు దీవించాలని పూజలు చేశారు. గత ప్రభుత్వ తప్పులు ఒక్కొక్కటిగా బయటకు తీసి బాధ్యులను శిక్షిస్తామని చెప్పిన చంద్రబాబు అది తిరుపతి స్వామి వారి సన్నిధి నుంచే మొదలు పెడతామని చెప్పారు.
గతంలో రోజా మంత్రిగాఉన్న సమయంలో దాదాపుగా వారానికి ఒక సారి తిరుమల వేంకటేశ్వరుడిని 100 మందితో ప్రొటోకాల్ దర్శనం చేసుకునేవారు. ప్రొటోకాల్ దర్శనం అంటే కేవలం వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఉండాలి. కానీ రోజా మాత్రం మంది మార్బలంతో వచ్చేవారు. పైగా అందరినీ వీఐపీ దర్శనం చేసుకోమని ఆదేశాలు కూడా ఇచ్చేవారు.
ఇలా వారికి వీఐపీ దర్శనాలు కల్పిస్తూ రోజా భారీగా సంపాదించారని ఆమె నియోజకవర్గంలో టాక్. రోజా గోవింధుడి దర్శనాలపై విచారణ జరిపించాలని ప్రజలు కోరుతున్నారు. రోజాతో పాటు ఆమెతో వచ్చిన వారి ఆధార్ కార్డు వివరాలు టీటీడీ వద్ద లభిస్తే ప్రజలను సులభంగా ట్రాక్ చేయవచ్చు. వ్యవస్థల ప్రక్షాళన టీటీడీతోనే ప్రారంభమవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రోజాపై ఈ ఆరోపణలు నిజమైతే ఆమెపై చర్యలు తీసుకుంటామని, ఇది ఇప్పుడున్న ప్రజా ప్రతినిధులందరికీ కూడా అర్థం అవుతుందని బాబు అనుకుంటున్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నగరిలో రోజా 45,004 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికల సమయంలో రోజా సాక్షితో మాట్లాడుతూ సొంత పార్టీ నేతలే తనను పక్కన పెట్టారని ఆరోపించారు. ఫలితాల అనంతరం ఆమె పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొందరు వైయస్సార్ కాంగ్రెసు నాయకులు మీడియా ముందుకు వస్తున్నా ఆమె మౌనంగా ఉండిపోయారు.