KTR : గనుల శాఖలో అక్రమాలపై విచారణ జరిపించండి: కేటీఆర్

KTR

KTR

KTR : గనుల శాఖలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. నకిలీ పత్రాలు, రసీదులు సృష్టించి ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి రూ.150 కోట్ల విలువైన ఇసుకను దోచుకున్న ఇంటిదొంగలపై దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన.. సీఎం రేవంత్ రెడ్డి గనుల శాఖలో అవినీతి ఘనులని పేర్కొన్నారు. నకిలీ పత్రాలు రసీదులతో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి రూ.150 కోట్లు విలువ చేసే 1.5 లక్షల టన్నుల ఇసుక దోచేశారని ఆరోపించారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అవసరాల కోసమంటూ తప్పుడు కాగితాలు సృష్టించి ఇసుకను దారి మళ్లించారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న శాఖలోనే జరిగిన ఈ కుంభకోణం, ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా ఉండదని వ్యాఖ్యానించారు. వెంటనే ఈ ఇసుక దొంగలెవరో దర్యాప్తు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

TAGS