CM Chandrababu : ఏపీ రాజధాని అమరావతిలో పెట్టుబడుల కోసం సీఎం చంద్రబాబు నాయుడు కర్ణాటక వ్యాపారవేత్తలకు పలు సూచనలు చేశారు. చిత్తూరు నుంచి తిరుగు పయనంలో భాగంగా బుధవారం బెంగళూరులోని హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టులో ఆయన కొద్దిసేపు ఆగారు. ఆ సమయంలో సెంచురీ గ్రూప్ సంస్థల ఈడీ అశ్వినిపై, ఎండీ రవీంద్ర పైలతో చంద్రబాబు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వారిని అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. అలాగే చంద్రబాబును కర్ణాటక తెలుగు సమాఖ్య ప్రధాన కార్యదర్శి బెల్లం రమణ, ఆ రాష్ట్ర ఇంటర్నల్ సెక్యూరిటీ డివిజన్ ఏడీజీపీ మువ్వ చంద్రశేఖర్ కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక బాబు పిలుపు మేరకు అమరావతిలో పెట్టుబడుల విషయంపై వచ్చే ఆర్థిక సంవత్సరంలోకా నిర్ణయం తీసుకుంటామని సెంచురీ గ్రూప్ సంస్థల ఈడీ అశ్విని పై వెల్లడించారు.