Pithapuram : పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను ఓడించాలని వైసీపీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు. బందిపోట్లు, గూండాలు పిఠాపురాన్ని గుప్పిట్లో తీసుకున్నారు. ఎటు చూసినా వారి ఆగడాలే కనిపిస్తున్నాయి. ఒక్కో వైసీపీ నేతకు రూ. 5 లక్షల వరకు డబ్బు ముట్టజెప్పుతున్నారు. ఇక వారు ఊరంతా పంచుతున్నారు.
గోవా నుంచి సుమారు రూ.50 లక్షల మద్యం తీసుకొచ్చి డంపు చేశారు. అధికారుల కళ్లు గప్పి మద్యం ఎలా తీసుకొచ్చారో తెలియదు. కానీ పిఠాపురంలో ఎటు చూసినా మద్యం ఏరులై పారుతోంది. ఎర్ర చందనం దొంగలు కూడా ఇందులో పాలు పంచుకుంటున్నారు. ఇలా వైసీపీ చెత్త రాజకీయాలకు తెర తీస్తోంది. పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసుకుని ఇదంతా చేస్తున్నారు.
వంగా గీత అభ్యర్థి అయినా గూండాలదే రాజ్యం. వారిదే పెత్తనం. అన్నింట్లో వారి హస్తం ఉంటోంది. రాష్ట్రం మొత్తం నకిలీ మద్యంతో నిండిపోయింది. పిఠాపురంలో అయితే మద్యం ఎక్కువగా లభిస్తోంది. దీనికి వైసీపీ నేతలే సహకరిస్తున్నారు. పిఠాపురంలో అతిగా మద్యం పంపిణీ చేస్తూ పవన్ ను ఓడించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు.
అన్నింటిని ప్రజలు గమనిస్తున్నారు. జగన్ తీరును పరిశీలిస్తున్నారు. విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నా ప్రజలు మాత్రం పవన్ వెంట నిలస్తారనేది తెలుస్తోంది. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా పవన్ గెలుపు ఖాయమనే వాదనలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో వైసీపీ ఎంత శ్రమించినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందనేది నిర్వివాదాంశమే.
పిఠాపురం రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. పవన్ కల్యాణ్ పోటీలో ఉండటంతో వైసీపీ కుట్రలు చేస్తోంది. అక్రమ మార్గాల్లో నెగ్గాలని పలు ప్లాన్లు వేస్తోంది. కానీ ఎన్ని ప్లాన్లు వేసినా చివరకు పవన్ దే విజయం అంటున్నారు. ఈ సారి ఇక్కడి నుంచే పవన్ కల్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టడం జరుగుతుందని భరోసా వ్యక్తం చేస్తున్నారు.