Alcohol : మత్తు దించుతున్న మద్యం ధరలు.. తాగక ముందే షాక్
తక్కువ ధరకు నాణ్యమైన మందు దొరుకుతుందనే గంపెడాశలతో ఉన్న మద్యం ప్రియులు కొత్త విధానంతో బెంబేలెత్తిపోతున్నారు. మద్యంపై డ్రగ్స్ రీహాబిలిటేషన్ సెస్ విధిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో కూడా చేసింది. డ్రగ్స్ రీహాబిలిటేషన్ కింద మద్యం ల్యాండెడ్ రేట్లపై రెండు శాతం అదనంగా పన్ను విధిస్తున్నది. ఈ పన్ను ద్వారా అదనంగా రూ.100 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి రానుంది. ఇలా వచ్చిన నిధులను డ్రగ్స్ నియంత్రణ, రీహాబిలిటేషన్ కేంద్రాల కోసం ఏపీ సర్కార్ వినియోగించనుంది. ఇక డ్రగ్స్ రీహాబిలిటేషన్ పన్నును అమలు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
మద్యం బాటిల్ ధర రూ.150.50 పైసలు ఉంటే కొత్త పన్ను ప్రకారం రూ.160 వసూలు చేస్తారు. బాటిల్ ధర రూ.200.050 పైసలు ఉంటే కొత్త పన్ను ప్రకారం రూ.210 దాకా వసూలు చేస్తారు. నూతన మద్యం విధానం ప్రకారం రూ.99 లకే క్వార్టర్ మద్యం అందిస్తామని టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఒక్కో క్వార్టర్ కు రూ. 210 చొప్పు వసూలు చేస్తున్నారు దీంతో మద్యం ప్రియులు ఇవేం రేట్లు అంటూ మండిపడుతున్నారు.