Suicide : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో ముగ్గురు పిల్లలతో కలిసి ఓ తండ్రి ఆత్మహత్యాయత్నం చేశాడు. బీఎన్ రెడ్డి నగర్ కు చెందిన అశోక్ అనే వ్యక్తి ముగ్గురు పిల్లలను కారులో మార్నింగ్ వాక్ కు తీసుకొచ్చి వేగంగా ఇనాంగూడ చెరువులోకి దూసుకెళ్లి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. దీంతో కారు చెరువులో మునిగిపోయింది. అది గమనించిన స్థానికులు వెంటనే తాళ్లు, ట్యూబులతో కారుతో సహా నలుగురిని ఒడ్డుకు చేర్చారు. పిల్లలతో సహా తండ్రి ప్రాణాలతో బయటపడ్డారు.
విషయం తెలిసి ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి వారిని అబ్దుల్లాపూర్ మెట్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారించారు. అయితే, కుటుంబ, ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.