Chandrayaan-3 : చంద్రయాన్-3 ప్రాజెక్టుకు ఇంటర్నేషనల్ స్పేస్ అవార్డు

Chandrayaan-3

Chandrayaan-3

Chandrayaan-3 : భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ విజయవంతంగా నిర్వహించిన చంద్రయాన్-3 ప్రాజెక్టుకు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ చంద్రయాన్-3కి ఇంటర్నేషనల్ స్పేస్ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును అక్టోబర్ 14న ఇటలీలోన మిలాన్ లో జరుగనున్న 75వ అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ కాన్ఫరెన్స్ ను పురస్కరించుకొని అందజేయనున్నారు.

2023 ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ ను భారత్ విజయవంతంగా ఇస్రో ల్యాండింగ్ చేసింది. అమెరికా, చైనా, రష్యా తర్వాత చంద్రుడిపై కాలుపెట్టిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. ఇప్పటి వరకు ఏ దేశం వెళ్లని చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించింది. రెండు వారాల పరిశోధనలు సాగించేలా విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లను ఇస్రో రూపొందించింది. విక్రమ్ ల్యాండ్ అయిన తర్వాత లోపలి నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్ రోవర్ 100 మీటర్ల దూరం ప్రయాణించి అక్కడ సమాచారాన్ని సేకరించింది. ఆ తర్వాత ల్యాండర్, రోవర్లు స్లీప్ మోడ్ లోకి వెళ్లాయి.

TAGS