Chandrababu Vs Jagan : స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ లో అవినీతి జరిగిందని మాజీ సీఎం చంద్రబాబును వైఎస్ జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలు లో పెడితే రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. విదేశాల్లో కూడా ఇది అన్యాయం అంటూ అసహనం వ్యక్తం అయ్యింది. ప్రధానంగా ఐటి ఉద్యోగులు తమ విధులు బహిష్కరించి ఆందోళన బాటపట్టాయి. ఆ సమయంలో కనీసం ప్రధాన మంత్రి తో సహా బిజెపి నాయకలు ఎవ్వరు కూడా ఇది అన్యాయం అంటూ నోరు మెదపలేదు. చివరకు తెలంగాణ అప్పటి సీఎం కేసీఆర్ కూడా ఖండించలేదు. అదేవిదంగా లిక్కర్ అవినీతిలో కేసీఆర్ కూతురు ఆరోపణలు ఎదుర్కొంటు ఇటీవల అరెస్ట్ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటివరకు తెలుగుదేశం నేతల్లో ఏ ఒక్కరు కూడా సానుభూతి చూపించలేదు. అంతేకాదు కనీసం పత్రికా ప్రకటన కూడా ఇచ్చి ఖండించలేదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విజయవాడ లో పర్యటిస్తున్న నేపథ్యంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేయగా చిన్న గాయమైనది.నిజంగా అది ఎవరన్నా కావాలనే కోపంతో కొట్టారా ?? లేదంటే ఎన్నికల్లో సానుభూతి రావాలనే ఆశతో ఆయనే కొట్టించుకున్నాడో ఆ దేవుడికే తెలియాలి. కానీ ఆ విషయాన్నీ ఢిల్లీ లో ఉన్న బిజెపి పెద్దల నుంచి మొదలుకొని తెలంగాణ లో ఉన్న కేటీఆర్ వరకు కొందరు ఖండించారు. రాయి దాడి ఇదొక పెద్ద నాటకమంటూనే టీడీపీ పెద్దలు ఖండించడం విశేషం. కానీ జగన్ సేన మాత్రం సొంత మీడియాలో రాయి దాడిని ఎంత ప్రచారం చేసుకోవాలో అంతకు రెట్టింపు ప్రచారం చేసుకొంది. జగన్ అధికారం లోకి రాగానే చిత్ర పరిశ్రమను ఎలా ఏడిపించాలి అనుకున్నాడో అలానే ఏడిపించాడు. చంద్రబాబు అరెస్టు సినీపరిశ్రమలో దాదాపుగా ఖండించారు.జగన్ రాయి దాడిని మాత్రం కేవలం ఇండస్ట్రీ లో ఒకే ఒక్కరు ఎవరంటే రాంగోపాల్ వర్మ ఖండిస్తూ ట్విట్ చేయడం విశేషం.
సినీ ఇండస్ట్రీ లో చంద్రబాబు నాయుడు సంపాదించుకున్న అభిమానంకు జగన్ సంపాదించుకున్న ప్రేమాభిమానాలకు ఉన్న తార్కాణమే అది..అక్రమసంపాదన కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డని సిబిఐ జైలు లో పెట్టింది.అప్పుడు తమ రాజకీయ భవిష్యత్తు కోసం YSRCP నేతలు తండోపతండాలుగా వెళ్లి పరామర్శించారు.వారితోపాటు రక్తసంబంధికులు వెళ్లి పరామర్శించి రావడం జరిగింది. చంద్రబాబును జగన్ ప్రభుత్వం జైల్లో పెడితే జనసేన అధినేత వెంటనే వెళ్లి పరామర్శించి రావడం జరిగింది.అంతేకాదు తెలుగుదేశం తో జనసేన పొత్తు కూడా ఎన్నికల్లో ఉంటుందని అప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కానీ ఇద్దరి మధ్య ఒక పెద్ద తేడా స్పష్టంగా కనిపిస్తుంది.జగన్ వలన ఎవరైనా లబ్ది పొందితే, వారు చెప్పుకోరు. జగన్ తోపాటు ఆయన సొంత భజన పరులు గొప్పలుగా చెప్పుకొని పబ్బం గడుపుకుంటారు. కానీ చంద్రబాబు విషయంలో ఆలా ఉండదు.చంద్రబాబు వలన ఎవరికయినా మంచి జరిగితే ఇక్కడ చంద్రబాబు చెప్పుకోడు.చంద్రబాబు వలన నేను మేలు పొందాను అంటూ లబ్ది పొందిన వ్యక్తి గొప్పగా చెప్పుకుంటాడు. ఇద్దరి మద్యన ఉన్న రాజకీయ సేవ ఇలా ఉంటది అని చెప్పడానికి ఇది ఒక