Medigadda Barrage : మేడిగడ్డపై మధ్యంతర నివేదిక – రాష్ట్ర నీటి పారుదల శాఖకు పంపిన ఎన్డీఎస్ఏ
Medigadda Barrage : మేడిగడ్డపై తీసుకోవలసిన చర్యలపై నేషనల్ డ్యాం సేఫ్టీ ఆధారిటీ (ఎన్డీఎస్ఏ) మధ్యంతర నివేదికను సోమవారం రాష్ట్ట నీటి పారుదల శాఖకు పంపించింది. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఈ బ్యారేజీలను పరిశీలించడంతో పాటు నీటి పారుదల శాఖ అధికారులు, ఏజెన్సీలతో చర్చించింది. పూర్తి నివేదక రావడానికి సమయం పట్టే అవకాశం ఉండడంతో.. వర్షాకాలంలోకా తాత్కాలిక మరమ్మతులు చేపట్టవలసిన నేపథ్యంలో మధ్యంతర నివేదిక ఇవ్వీలని నీటిపారుదల శాఖ కోరింది. దీంతో అయ్యర్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన సిఫార్సులతో మధ్యంతర నివేదికను ఎన్డీఎస్ఏ రాష్ట్రానికి పంపింది.
మధ్యంతర నివేదవికలో తాత్కాలికంగా చేపట్టాల్సిన పనులతో పాటు తదుపరి ఎలాంటి పరీక్షలు చేపట్టాలో కూడా ఇందులో పేర్కొన్నట్లు తెలిసింది. మేడగడ్డలో ఏడో బ్లాక్ కు మాత్రమే నష్టం వాటిల్లిందా, మిగిలిన బ్లాకుల పరిస్థితిని తెలుసుకోవడానికి పలు పరీక్షలు సూచించినట్లు సమాచారం.