Hero Darshan : కన్నడ స్టార్ హీరో దర్శన్ కు మధ్యంతర బెయిల్.. కోర్టు పెట్టిన కండీషన్లు తెలిస్తే షాకే
Hero Darshan : చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో రెండో నిందితుడు, నటుడు దర్శన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ కండీషన్లు వింటే షాక్ అవ్వాల్సిందే. హైకోర్టు బెయిల్ మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కఠిన షరతులు విధించింది. ప్రస్తుతం బళ్లారి జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న దర్శన్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై వాదనలు విన్న జస్టిస్ ఎస్.విశ్వజిత్ శెట్టి నేతృత్వంలోని సింగిల్ జడ్జి ధర్మాసనం తీర్పును మంగళవారానికి రిజర్వ్ చేసింది. ఉదయం విచారణ ప్రారంభమైన వెంటనే ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పొడిగించిన ఆర్డర్ ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది. దర్శన్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ నగేష్, ఈ కేసులో స్పెషల్ ప్రాసిక్యూటర్‌గా నియమితులైన పి.ప్రసన్నకుమార్ వాదించారు.
కండీషన్లు ఇవే.
శస్త్ర చికిత్స అవసరం అయినప్పుడు వైద్య సహాయం ఆధారంగా ఈ మధ్యంతర బెయిల్ ఆరు వారాలపాటు చెల్లుబాటు అవుతుంది. దర్శన్ తన వెన్నెముక సమస్యకు సంబంధించి తనకు సౌకర్యంగా ఉన్నా ఏ హాస్పిటల్ లోనైనా చికిత్స పొందవచ్చు. దర్శన్ తన పాస్‌పోర్టును ట్రయల్ కోర్టుకు అప్పగించాలి. ఆరోగ్య పరిస్థితి, ప్రతిపాదిత చికిత్స, ఆసుపత్రిలో ఉండే సమయం, తదుపరి చికిత్సకు సంబంధించి వారంలోగా కోర్టుకు నివేదిక సమర్పించాలి.
బెంగళూరులోని పట్టగెరె షాద్‌లో రేణుకాస్వామిని దర్శన్ కిడ్నాప్ చేయించి హత్య చేయించాడని పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలసిందే. హీరో దర్శన్ తో పాటు అతని స్నేహితురాలు నటి పవిత్ర గౌడ సహా 17 మందిని ఈ కేసులో నిందితులు చేర్చారు. దాడి వల్లే రేణుకాస్వామి చనిపోయాడని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. జూన్ 8న కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్వర్టులో రేణుకాస్వామి మృతదేహం దొరకగా, జూన్ 10న దర్శన్‌ను మైసూరులో కామాక్షిపాళ్య పోలీసులు అరెస్టు చేసి బెంగళూరుకు తీసుకొచ్చారు. బెంగళూరు సెంట్రల్ జైలు, బళ్లారి జైలులో దర్శన్ మొత్తం 140 రోజులు గడిపారు. నేడు లేదా రేపు బళ్లారి జైలు నుంచి బయటకు వచ్చి చికిత్స కోసం హాస్పిటల్ లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.