JAISW News Telugu

Motilal Nehru : స్వాతంత్రోద్యమంలో సంపన్న లాయర్..మోతీలాల్ నెహ్రూ గురించి ఆసక్తికర విషయాలు..

Motilal Nehru

Motilal Nehru

Motilal Nehru : మోతీలాల్ నెహ్రూ దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తండ్రి. మోతీలాల్ నెహ్రూ దేశ ప్రఖ్యాత న్యాయవాదిగానే కాకుండా స్వాతంత్ర్య సమరయోధుడు కూడా. ఆయన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. మోతీలాల్ నెహ్రూ మే 6, 1861న జన్మించారు.  అన్న నందలాల్ నెహ్రూ ఆయనను పెంచారు. అతను ఆగ్రా హైకోర్టులో న్యాయవాదిగా ఉండేవారు. హైకోర్టు అలహాబాద్‌కు మారిన వెంటనే మోతీలాల్‌తో కలిసి నంద్‌లాల్ కూడా ఇక్కడికి వచ్చారు. తన సోదరుడి బాటలో మోతీలాల్ న్యాయవాద వృత్తిని చేపట్టారు. మోతీలాల్ కేంబ్రిడ్జ్‌లో న్యాయవాద పరీక్షలో అగ్రస్థానంలో నిలిచారు. మోతీలాల్ భారతదేశానికి వచ్చి కాన్పూర్‌లో ట్రైనీ లాయర్‌గా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు.

అప్పట్లో దేశంలో కొంతమంది బారిస్టర్లు మాత్రమే ఉండేవారు. మోతీలాల్ నెహ్రూ ఒక అసాధారణ న్యాయవాది. అతను తన కాలపు ధనవంతులలో ఒకడు. అతని వక్తృత్వ నైపుణ్యం, కేసులను వాదించే విధానం చాలా ప్రత్యేకం.  మోతీలాల్ నెహ్రూ మొదటి కేసుకు ఫీజుగా కేవలం ఐదు రూపాయలు మాత్రమే తీసుకున్నాడు. కానీ తర్వాత ఒక్కో  కేసుకు వేల రూపాయలు ఇచ్చే వారు. అతను పెద్ద భూస్వాములు, రాజుల నుంచి భూమికి సంబంధించిన కేసులను స్వీకరించాడు. అనతి కాలంలోనే దేశంలోనే అత్యంత ఖరీదైన, అత్యంత ధనిక న్యాయవాది అయ్యాడు.

మోతీలాల్ నెహ్రూ భారతీయ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు. మోతీలాల్ దేశంలో అత్యంత బలమైన రాజకీయ కుటుంబ స్థాపకుడు. మోతీలాల్ నెహ్రూ ఆగ్రాలో పుట్టాడు, తండ్రి ‘గంగాధర్’ ఒక కాశ్మీరీ పండిట్ కుటుంబీకుడు. నెహ్రూ, ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ నుంచి బారిష్టరు డిగ్రీను పొందాడు.  ఆయన మహాత్మా గాంధీ మార్గదర్శకత్వంలో జాతీయ రాజకీయాలలో ప్రవేశించాడు. మోతీలాల్, స్వరూప్ రాణీని వివాహమాడాడు.


మోతీలాల్ నెహ్రూ గురించి కొన్ని ముఖ్య విషయాలు :

–  భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో విలాసవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి దేశం కోసం అన్నింటినీ పణంగా పెట్టిన ఏకైక వ్యక్తి మోతీలాల్ నెహ్రూ.

– మోతీలాల్ నెహ్రూ తండ్రి పేరు గంగాధర్, తల్లి పేరు ఇంద్రాణి. మోతీలాల్ నెహ్రూ భార్య పేరు ‘స్వరూప్ రాణి’. అతను భారతదేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తండ్రి.

– పాశ్చాత్య-శైలి విద్యను పొందిన మొదటి తరంలో ఉన్న కొద్దిమంది భారతీయులలో ఇతను ఒకడు. మోతీలాల్ జీ చాలా తెలివైన వ్యక్తి. అతను అరబిక్, పర్షియన్ భాషలలో విద్యను అభ్యసించాడు.

– మోతీలాల్ నెహ్రూ పాశ్చాత్య జీవనశైలి, ఆలోచనలకు బాగా ప్రభావితమయ్యారు, కానీ గాంధీజీతో పరిచయం ఏర్పడిన తర్వాత అతని జీవితంలో పెద్ద మార్పు వచ్చింది.
 
– గాంధీజీ పిలుపు మేరకు మోతీలాల్ నెహ్రూ 1919లో అమృత్‌సర్‌లో జలియన్‌వాలాబాగ్ కాల్పుల తర్వాత న్యాయవాద వృత్తిని విడిచిపెట్టారు.
 
– మోతీలాల్ నెహ్రూ 1919 , 1920లో రెండుసార్లు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

– 1923లో దేశబంధు చిత్తరంజన్ దాస్‌తో కలిసి స్వరాజ్ పార్టీని స్థాపించారు.
 
-మోతీలాల్ నెహ్రూ స్వాతంత్ర్య ఉద్యమంలో భారతీయ ప్రజలకు అనుకూలంగా స్వతంత్ర వార్తాపత్రికను కూడా నడిపారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం కోసం అతను అనేక సార్లు జైలుకు వెళ్ళాడు.
 
– చట్టంపై ఆయనకు ఉన్న పట్టు కారణంగా, 1927లో ఆయన అధ్యక్షతన ఆల్ పార్టీ కాన్ఫరెన్స్ భారత రాజ్యాంగాన్ని రూపొందించే బాధ్యతను అప్పగించిన సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదికను ‘నెహ్రూ నివేదిక’ అని కూడా అంటారు.

– మోతీలాల్ నెహ్రూ 06 ఫిబ్రవరి 1931న లక్నో (ఉత్తరప్రదేశ్)లో మరణించారు.

Exit mobile version