KTR and Kodandaram : ఆసక్తికర పరిణామం.. ఒకే వేదికపై కేటీఆర్, కోదండరాం

KTR and Kodandaram
KTR and Kodandaram : తెలంగాణలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాజకీయ ప్రత్యర్థులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం ఒకే వేదికపై కనిపించారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి సంస్మరణ సభ శనివారం (సెప్టెంబరు 21) రవీంద్ర భారతిలో సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సభలో కేటీఆర్, ఎమ్మెల్సీ కోదండరాం పక్కపక్కనే కూర్చొన్నారు. కేటీఆర్, కోదండరాం ఒకరినొకరు పలకరించుకొని కాసేపు మాట్లాడుకున్నారు. చాలా రోజుల తర్వాత వీరు ఒకే వేదికపై కనిపించడం చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్, కోదండరాం ఈ వేదికను పంచుకోవలసి ఉంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మరో 5 నిమిషాల్లో వస్తారని తెలియగానే కేటీఆర్ మాట్లాడి వెళ్లిపోయారు.