Jagan and Raghurama : అసెంబ్లీలో జగన్, రఘురామ ఆసక్తికర సంభాషణ

Jagan and Raghurama
Jagan and Raghurama : ఈరోజు (సోమవారం) అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా ప్రారంభమయ్యాయి. ఈరోజు నల్ల కండువాలతో వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో జగన్, రఘురామకృష్ణ రాజు మధ్య ఆసక్తికరణ సంభాషణ హైలైట్యగా నిలిచింది. సభ జరిగినన్ని రోజులు రావాలని జగన్ ను రఘురామ కోరగా.. హాజరవుతానని బదులిచ్చారు. వాళ్లిద్దరూ ఇంకా ఏం మాట్లాడుకున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రతిరోజు అసెంబ్లీకి రండి.. ప్రతిపక్షం లేకపోతే ఎలా? అంటూ జగన్ చేతిలో చేయివేసి మాట్లాడారట. అసెంబ్లీకి రెగ్యులర్గా వస్తా.. చూస్తారుగా అంటు జగన్ బదులిచ్చినట్లు తెలుస్తోంది. తనకు జగన్ పక్కనే సీట్ వేయించాలని పయ్యావుల కేశవ్ ను రఘురామ కోరారట. అలాగేనంటూ కేశవ్ నవ్వకుంటూ వెళ్లిపోయారని సమాచారం. ఈ సందర్భంగా రఘురామను పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలుకరించారు.