JAISW News Telugu

Alliance : మొత్తానికి నేరుగా చెప్పడం కంటే ఇలా చెప్పి కూటమి సెట్ చేశారు

alliance

AP alliance, Pawan and Anita Chitchat

AP alliance : డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ హోంమంత్రి అనిత వంగలపూడి, పోలీస్ అధికారులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతటి సంచలనంగా మారాయో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత మంత్రివర్గ సమావేశంలో దానికి ఆయన చెప్పిన కారణాలు, ఆ తర్వాత అనిత వంగలపూడి సచివాలయంలో పవన్ ఛాంబర్‌కి వెళ్లి చర్చలు జరుపడం, వారిరువురూ అన్నా చెల్లెళ్ల మాదిరిగా హాయిగా నవ్వుతూ కబుర్లు చెప్పుకోవడం అన్నీ పరస్పరం భిన్నమైనవే. పవన్‌ కళ్యాణ్‌ ఆ విధంగా మాట్లాడినప్పుడు “అప్పుడే టీడీపీ, జనసేనల మధ్య చిచ్చు మొదలైంది. కూటమిలో పొరపొచ్చాలు వచ్చాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆయనే స్వయంగా ధృవీకరించారు. కూటమి ప్రభుత్వంలో అందరూ పవన్‌ కళ్యాణ్‌ని ద్వితీయశ్రేణి పౌరుడిగా చులకనగా చూస్తున్నారంటూ..” రకరకాల విశ్లేషణలు బయటకు వచ్చాయి.

ఆ తర్వాత మంత్రివర్గ సమావేశంలో తన ఆవేశానికి చెప్పిన కారణం విన్నప్పుడు, ‘అయితే రాష్ట్రంలో ఆడబిడ్డల గురించి కాదన్న మాట.. తన పిల్లల బాధ చూడలేకనే అలా మాట్లాడారన్న మాట,’ అని వైసీపీ దానికి నిగూఢార్థం తీసింది. ఆ తర్వాత హోంమంత్రి అనిత వంగలపూడి పవన్‌ కళ్యాణ్‌ని వెళ్లి కలిసినప్పుడు, అంతకు ముందు రోజు ద్వితీయశ్రేణి పౌరుడని అభివర్ణించినవారే కూటమి ప్రభుత్వంలో పవన్‌ కళ్యాణ్‌ హవా నడుస్తోందన్నారేు. పవన్‌ ఒక్క మాట అనేసరికి చంద్రబాబు పోలీస్ శాఖలో బదిలీలు చేపట్టారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు చేయిస్తున్నారు,” అంటూ మళ్లీ ఆయనను ఆకాశానికి ఎత్తేశారు.

కానీ రాష్ట్రంలో రెండ్రోజుల్లో జరిగిన ఈ పరిణామాలు టిడిపి, చంద్రబాబు వీర భక్తులను ఆలోచింపజేస్తున్నాయి. చంద్రబాబు  మిత్రధర్మం పాటించి పవన్‌ కళ్యాణ్‌కి, తన అభిప్రాయాలకు అంత గౌరవం ఇస్తున్నారా? లేదా కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య పవన్‌ అనే బలమైన ‘లింక్’ చాలా అవసరమని గౌరవిస్తున్నారా? అని చర్చించుకోవడం మొదలు పెట్టేశారు. కానీ ఇటువంటి విషయాలు పవన్‌  బహిరంగంగా కాక నేరుగా చంద్రబాబుకే చెప్పి ఉంటే బాగుండేది. కానీ నేరుగా చెప్పడం కంటే బహిరంగంగా చెప్పడం వల్లనే దాని ఇంపాక్ట్ బాగా కనిపిస్తుందని పవన్ భావించి ఉండవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూటమిలో అందరూ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో బాగా నేర్చుకున్నారని ఈ పరిణామాలతో అర్దమవుతుంది.

Exit mobile version