అయితే ఇప్పుడు కాంప్రమైజ్ కావాల్సిన పనిలేదు. బడ్జెట్ ఎక్కవవుతుందని బాధపడాల్సిందేమీ లేదు. ఓ స్టార్టప్ కంపెనీ తక్కువ ఖర్చుతో పాటు మంచి క్వాలిటీతో అదీ అప్పటికప్పుడు కెమెరామెన్లు, వీడియో ఎడిటర్లను అందుబాటులో తీసుకువచ్చింది. ఈ కంపెనీ ఇప్పటికే హైదరాబాద్, బెంగళూర్, వైజాగ్, కరీంనగర్, వరంగల్ కు విస్తరిపంజేసింది.
పెద్ద పెద్ద ఈవెంట్స్ తో పాటు చిన్న చిన్న పార్టీలకు సైతం సేవలందిస్తున్నది. ఈ కంపెనీలో దాదాపు 250 మంది వీడియోగ్రాఫర్లు చేరిపోయారు. వీరికి వీడియోగ్రఫీతో పాటు ఎడిటింగ్ లోనూ తర్ఫీదు ఇచ్చారు. ఈ కంపెనీ యాప్ డౌన్లోడ్ చేసుకొని వీడియో గ్రాఫర్ ను బుక్ చేసుకోవచ్చు. అతను బుక్ చేసుకున్న సమయానికి చేరుకొని వీడియోలు, ఫొటోలు తీసి పెడతాడు. అలాగే 30 సెకన్ల నుంచి నిమిషం నిడివి గల వీడియోలు చక్కగా ఎడిట్ చేసి ఇచ్చేస్తాడు. దీనికి తీసుకునే సమయం కూడా కేవలం గంట మాత్రమే.
దీనికి ముందుడుగు వేసింది ఫ్లాషూట్ అనే స్టార్టప్ కంపెనీ. పేరంటాల్లో మహిళలకు అసౌకర్యం కలుగకుండా కెమెరా ఉమెన్ లను కూడా వీరి వద్ద అందుబాటులో ఉన్నారు. హై ఎండ్ కెమెరా ఉన్న మొబైల్ తో ఎంచక్కా ఫొటోలు, వీడియోలు తీసి అప్పటికప్పుడు అప్పగించేసి వెళ్లిపోతారు.