JAISW News Telugu

Food safety officials : హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

Food safety officials

Food safety officials

Food safety officials : హైదరాబాద్ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు (2024, నవంబరు 20) బుధవారం మెరుపు దాడులు చేశారు. రాష్ట్ర రాజధానిలో ఫుడ్ కల్తీ ఘటనలు రోజుకో చోట వెలుగు చూస్తుండడంతో బుధవారం నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, సూపర్ మార్కెట్లలో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా యూసఫ్ గూడా రత్నదీప్ సూపర్ మార్కెట్ లో సోదాలు నిర్వహించిన అధికారులు ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలకు విరుద్ధంగా పలు ఐటమ్స్ అమ్ముతున్నట్లు గుర్తించి ఈ మేరకు సూపర్ మార్కెట్ నిర్వాహకులకు అధికారులు నోటీసులు జారీ చేశారు.

అమీర్ పేటలోని ఉత్తరాస్ టిఫిన్స్, అయితే బిర్యానీ, టిబ్బ్స్ ప్రాక్టీస్, కింగ్స్ ఆఫ్ కబాబ్స్ తో పాటు మెహదీపట్నంలోని అబ్దుల్ బాయ్స్ హాస్టల్, మధురానగర్ లోని యూనివర్సల్ ఆల్ మాతం మండి కబాబ్స్ అండ్ బిర్యానీ సెంటర్లో కూడా అధికారులు తనిఖీలు చేశారు. పలు రెస్టారెంట్లు సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించి వాటిని సీజ్ చేసి టెస్టింగ్ కోసం శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కి పంపించారు.

Exit mobile version