Anantapur District : వాటర్ ట్యాంకులో పురుగుల మందు.. అనంతలో దుండగుల దుశ్చర్య

Anantapur District
Anantapur District : అనంతపురం జిల్లా కనేకల్ మండలం తుంబిగనూర్ గ్రామంలో శుద్ధజల నీటి ట్యాంకులో గుర్తు తెలియని వ్యక్తులు పురుగుల మందు కలిపారు. ఈ విషయం శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. దీంతో గ్రామానికి విడుదల చేసే తాగునీటి సరఫరాను ఆపివేశారు. ఈ మేరకు పోలీసులకు గ్రామస్థులు సమాచారం అందించగా ఎస్సై శ్రీనివాసులు గ్రామానికి వెళ్లి తాగునీటి ట్యాంకును పరిశీలించారు.
శుక్రవారం అర్ధరాత్రి ట్యాంకు వద్ద నుంచి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులను పారిపోవడాన్ని గ్రామస్థులు గమనించారు. అనుమానంతో ట్యాంకు వద్ద పరిశీలించగా లిక్విడ్ ఆనవాళ్లను గుర్తించారు. ఇటీవల ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడాన్ని జీర్ణించుకోలేక అక్కసుతోనే గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పొరపాటున ఎవరైనా నీరు తాగి ఉంటే పరిస్థితి ఏమిటని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.