Annamaya District : అన్నమయ్య జిల్లా వీరబల్లె మండలం షికారిపాలెంలో అమానుష ఘటన జరిగింది. ఓ మహిళను గ్రామస్థులు చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. కొందరు మహిళలు కర్రలతో కొడుతూ కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. సదరు మహిళ ఇటీవల భర్త నుంచి విడిపోయి మరో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పలువురు మహిళలు ఆమె తప్పు చేసిందంటూ చిత్రహింసలు పెట్టారు.
స్థానికుల సమాచారంతో వీరబల్లి పోలీసులు బాధితురాలిని పీఎస్ కు తీసుకువెళ్లారు. ఆమె నుంచి ఎస్సై ఫిర్యాదు తీసుకున్నారు. అనంతరం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.