Infosys : ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ ఏకీకృత పన్ను అనంతర లాభం (PAT) రూ.6,368 కోట్లు అని వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలలో రూ.5,945 కోట్లతో పోలిస్తే 7.1% పెరుగుదలను నమోదు చేసింది. గత త్రైమాసికంలో పన్ను రీఫండ్ ప్రోత్సాహం కారణంగా ఇన్ఫోసిస్ బాటమ్ లైన్ త్రైమాసిక ప్రాతిపదికన 20.1 శాతం పడిపోయింది.
సమీక్షా త్రైమాసికం సైతం 3.6 శాతం వృద్ధితో రూ.37,933 కోట్ల నుంచి రూ.39,315 కోట్లకు పెరిగినట్లు ఇన్ఫోసిస్ తన రెగ్యులేటరీ ఫైలింగ్ లో పేర్కొంది. మెరుగైన తొలి త్రైమాసిక ఫలితాల ఉత్సాహంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనాలను కూడా ఇన్ఫీ సవరించింది. స్థిర ధరల వద్ద 3-4 శాతం వృద్ధి నమోదు చేస్తామన్న విశ్వాసం వ్యక్తం చేసింది.