Minister Narayana : ఏపీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే పరిశ్రమలు రావాలి: మంత్రి నారాయణ

Minister Narayana
Minister Narayana : ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే కొత్త పరిశ్రమలు రావాలని మంత్రి నారాయణ అన్నారు. ఈరోజు (సోమవారం) తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. యువతకు ఉద్యోగావకాశాలు పెరగాలంటే పరిశ్రమలు రావలసిన అవసరముందని పేర్కొన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొచ్చే పనిలో సీఎం చంద్రబాబు ఉన్నారని తెలిపారు. రెండు నెలల్లోనే 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. సెప్టెంబరు 13న మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పారు.
అనంతరం తిరుపతిలోని తుడా (TUDA) కార్యాలయంలో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మౌర్య, తొడా వైస్ ఛైర్మన్ వెంకటనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.