Maha Chandi : ఇంద్రకీలాద్రి.. మహాచండీ దేవి అలంకారంలో దుర్గమ్మ

Maha Chandi
Maha Chandi : విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల ఐదో రోజున మహాచండీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్ట రక్షణ కోసం మహాలక్ష్మీ, మహాకాళీ, మహా సరస్వతి త్రిశక్తి స్వరూపంగా శ్రీ మహాచండీ అమ్మవారు ఉద్భవించారు. శ్రీ చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు ఉన్నారు. శ్రీ మహాచండీ అనుగ్రహం ద్వారా విద్య, కీర్తి, సంపదలు పొందడం, శత్రువులు మిత్రులుగా మారడం వంటి విశ్వాసం భక్తజనులలో ఉంది.
ఈ ఉత్సవాలలో సందర్భంగా అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఎలాంటి అసౌకర్యం ఏర్పడకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.