Jabardasth : జబర్దస్త్ లో మళ్లీ మార్పులు జరగనున్నాయని తెలుస్తోంది. జబర్దస్త్ నుంచి నాగబాబు, రోజా వెళ్లిపోయినప్పటి నుంచి ఇంద్రజ జడ్జిగా చేస్తున్నారు. ఈమె కూడా అనతి కాలంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుని తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. మొన్నటి వరకు రెండు రోజులు వచ్చే ఈ కామెడీ షో ఇప్పుడు ఒకే రోజుకు పరిమితమైనట్లు తెలుస్తోంది.
మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్స్ జబర్దస్త్ అనే కామెడీ షోను తీసుకొచ్చి ఈటీవీలో ప్రసారం చేసేది. ఇందులో ఇద్దరు జడ్జిలు ఆరు టీంలతో స్కిట్లు చేసి కొనసాగించేవారు. దీంతో యాంకర్ గ్లామర్ షో కూడా అదిరిపోయేది. యాంకర్ గా ముందు అనసూయ, తర్వాత రష్మీ అందాలు చూసేందుకు యువత ఎక్కువగా ఆసక్తి చూపేవారు. ప్రతి గురువారం రాత్రి 9.30 నిమిషాలకు మొదలయ్యే ఈ షోకు ఎక్కువ టీఆర్పీ రేటింగ్స్ తో తెలుగు బుల్లితెరలో రికార్డులు బ్రేక్ చేసింది. వేణు, , చంద్ర, శ్రీను.. రాఘవ ఇలా అనేక మంది స్టార్లుగా ఎదిగిపోయారు. రాకేశ్, సుధీర్, గెటప్ శ్రీనులు సినిమాల్లో కూడా రాణిస్తున్నారు. కొన్ని వందల మంది నటీనటులకు లైఫ్ ఇచ్చింది జబర్దస్త్ కామెడీ షో.
అయితే ఎక్స్ ట్రా జబర్దస్త్ కు రేటింగ్ తగ్గిపోవడంతో షోను మెల్లిగా తొలగించి కేవలం జబర్దస్త్ నే కొనసాగించాలని అనుకుంటున్నారు. జబర్దస్త్ లో నాగబాబు, రోజా ఉన్న సమయం లానే మళ్లీ మంచి స్కిట్ లు ఎక్కువ రేటింగ్ వచ్చేలా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీని కోసం రోజాను మళ్లీ జడ్జిగా పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోజా గనక వస్తే జబర్దస్త్ నుంచి తప్పుకునేందుకు ఇంద్రజ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రోజా ఎప్పుడు వచ్చిన తన స్థానం తనకు ఇచ్చేందుకు రెడీ అని ఇంద్రజ ఇప్పటికే ప్రకటించింది. జబర్దస్త్ లో రోజా వస్తే గనక మళ్లీ పూర్వపు ఫామ్ అందుకునే అవకాశం ఉన్నట్లు నిర్మాణ సంస్థ భావిస్తోంది. అందుకనుగుణంగా ఇంద్రజ ప్లేస్ లో రోజాకే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.