Indigo : ఇండిగో విమానంలో ప్రయాణించిన హైదరాబాద్ కు చెందిన ఓ జంటకు రూ.10 వేల పరిహారం చెల్లించాలని హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ఫోరం ఆదేశించింది. 45 రోజుల్లో పరిహారం మొత్తాన్ని చెల్లించాలని ఎయిర్ లైన్స్ ను ఆదేశించింది.
2021లో ఇద్దరు దంపతులు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఇండిగో ఎయిర్ లైన్స్ విమానంలో ప్రయాణించారు. విమానంలో అపరిశుభ్రత కారణంగా తన భర్త వాంతులు చేసుకున్నారని జిల్లా వినియోగదారుల ఫోరానికి ఫిర్యాదు చేశారు. కోచ్ లో చెత్త, ప్లాస్టిక్ సీసాలు, ఉపయోగించిన నాప్ కిన్ లతో నింపారని ఆరోపించారు. అయితే ఆరోగ్య సమస్యలను ఎన్నడూ ప్రస్తావించలేదని ఇండిగో ఎయిర్ లైన్స్ ఆరోపించింది. ఇరు పక్షాల వాదనలు విన్న బెంచ్ ప్రయాణికులు ఎక్కే ముందు ఇండిగో పరిశుభ్రత పాటించాలని ఆదేశించింది. జులై 1 నుంచి 45 రోజుల్లోగా పరిహారం మొత్తాన్ని చెల్లించాలని ఎయిర్ లైన్స్ ను ఆదేశించింది.